ఓర్వకల్లు తాహసిల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసన దీక్షలు నిర్వహించిన..... నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్

 ఓర్వకల్లు తాహసిల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసన దీక్షలు నిర్వహించిన... 

నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా ఓర్వకల్లు మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతుల కోసం నిరసన దీక్ష కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈసందర్భంగా పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమనీ,వ్యవసాయం పండుగ చేస్తామని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఆత్మహత్యలకు ఫురిగోల్పుతూ రైతుల కన్నీటిని చూస్తూ పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రైతులు గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి గోడును పట్టించుకొనే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని తెలుసుకోవాలని,ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యమేలుతున్న చీకటి పాలన గురించి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని,


చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలలో ప్రాజెక్టుల కోసం 68 వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారని, నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాలలో 22 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని, వ్యవసాయం మీద వీరికి ఏమాత్రం ప్రేమలేదని, అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాలు మనం ప్రతిరోజు పత్రికలలో చూస్తున్నామని,ఓర్వకల్లులో కోట్ల విలువ చేసే భూములను స్థానిక నాయకులు కబ్జాలు చేసుకుంటూ పోతున్న విషయం అందరికి తెలిసినదేనని,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు, ప్రజలకు,యువతకు, బడుగు బలహీన వర్గాల అందరికీ మేలు జరుగుతుందన్నారు.శాసనమండలి సభ్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని,రైతు సమస్యలు పేపర్లలో వచ్చిన కూడా పరిష్కారం చూపే పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదని,ఆయన ఊహల్లో పాలన కొనసాగిస్తున్నాడని,

రైతులు పంట కాలువలకు నీళ్లు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాల మీద నిరసనల ద్వారా సమస్యల గురించి మాట్లాడుకోవడానికి మరియు చెప్పుకోడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఆంక్షలు విధించడం ఎంత వరకు సమంజసం అని ఒకసారి ప్రజల ఆలోచించాలని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను ప్రజలను ఇబ్బంది పాలు చేస్తూ వారి కన్నీటిని చూస్తూ మోసపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటూ పాలన కొనసాగిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని,వైసిపి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత అతిపెద్ద వివాదం అమరావతి రాజధాని విషయమని, రాజధాని కోసం రాజధాని ప్రాంతంలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారని, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని అమరావతి రాజధాని అయితే అన్ని ప్రాంతాల వారు అభివృద్ధి చెందుతారని మంచి సదుద్దేశంతో వేలఎకరాల భూములు ఇవ్వడం జరిగిందని,సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో జీవోల మీద జీవోలు ఇస్తూ రైతులకు కంటి మీద నిద్ర లేకుండా రైతులపై కేసులు పెట్టించి రైతులను లాఠీలతో,బూటు కాళ్లతో తన్నించుకుంటూ,రైతు కూలీలను,అమరావతి రైతులను జైల్లో పెట్టించి, అరెస్టు చేయించి వారి కన్నీటిని చూస్తు ఆనందపడుతూ రైతులను మోసం చేస్తున్నాడని,చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే రైతు సమస్యలకు పరిష్కార మార్గం,అమరావతి రైతుల త్యాగం వృధా కాదని, రైతులు ధైర్యంగా ఉండాలని ఎవరు కూడా ఆత్మహత్యలకు చేసుకోవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు,మాజీమంత్రివర్యులు శాసనమండలి సభ్యులు ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లెనియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి,శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,ప్రముఖ న్యాయవాది తెలుగుదేశంపార్టీ నాయకుడు తాతిరెడ్డి తులసి రెడ్డి,కాపు సామాజిక వర్గం నాయకులు చింతల సుబ్బరాయుడు,పాణ్యం మండలం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ లాయర్ బాబు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు జయరామిరెడ్డి,ప్రముఖ కాంట్రాక్టర్ చాంద్ బాషా, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు,జడ్పీటీసీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: