ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందు అందించే...

బత్తిని హరినాథ్ గౌడ్ మృతి పట్ల....

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం 


(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందు అందించే బత్తిని హరినాథ్ గౌడ్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. బత్తిని హరినాథ్ గౌడ్ వంశపారంపర్యంగా వారి కుటుంబం తయారుచేసే చేప మందు మృగశిరకార్తె రోజున అందించి అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు  ఉపశమనం కలిగిస్తున్నారని, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందడం తనకు తీవ్ర బాధకు గురిచేసిందని బండారు దత్తాత్రేయ తెలియజేసారు. దేశవ్యాప్త ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు వీరు అందించిన నిస్వార్ధ సేవ అందించి అందరి మన్ననలు పొందారని,  వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని బండారు దత్తాత్రేయ  ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. బత్తిని హరినాథ్ గౌడ్  మృతి పట్ల సంతాపం ప్రకటించిన బండారు దత్తాత్రేయ వారి  ఆత్మకు శాంతి చేకూర్చాలని,  వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కష్ట సమయాన మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేసారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: