కేసీ కెనాల్ కు నీరు విడుదల చేసిన.. 

నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్థర్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని కెసి కెనాల్ ఆయకట్టు రైతుల నీటి అవసరం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సంప్రదించి,సంబంధిత జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్, నంద్యాల జిల్లా కలెక్టర్,సిఈ,ఎస్ఈ అధికారులను సంప్రదించి, వారి సహకారంతో నందికొట్కూరు మండలంలోని మల్యాల గ్రామం వద్ద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్  రెండు మోటర్ల ద్వారా 674 క్యూసెక్ ల నీటిని కేసికెనాల్ కు,రెండు మోటార్ల ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు 674 క్యూసేక్ ల నీటిని నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ విడుదల చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతు పక్షపాతని,సకాలంలో వర్షాలు అనుకూలంగా కురువకపోవడంతో నీటి లభ్యత కారణంగా కొద్దిపాటి ఆలస్యంగా నీటిని విడుదల చేయడం జరిగిందని,రైతులకు ఏ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి,తాను ముందుంటామని తెలిపారు.కొద్దిపాటి ఆలస్యమైన వేసిన పంటలకు నీటిని విడుదల చేసినందుకు కేసికెనాల్ ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జలవనరుల సంబంధిత అధికారులు, నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, మండలంలోని రైతున్నలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: