మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి
డోన్ సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో అగష్టు 16 న శ్రీ రామకృష్ణ పరమహంస వర్థంతి సందర్బంగా సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ పరమహంస గారి వర్థంతి సందర్బంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డోన్ సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ పరమహంస ఫిబ్రవరి 18 - 08-1836 బెంగాల్ లో జన్మించారని, తల్లిదండ్రులు భుబీరామ చటోపాధ్యాయ,చంద్రమణి దేవి అని, రామకృష్ణ పరమహంస గారి అసలు పేరు గదాధర చటోపాధ్యాయని, చిన్ననాటినుండే భక్తి ఎక్కువని,ఈయనలోని తేజస్సును గ్రహించిన శ్రీ తోతాపురి యోగి తన శిష్యుడుగా ఎంచుకొని శ్రీరామకృష్ణపరమహంసగా పేరు మార్చారని, ఆధ్యాత్మికంగా అనేక ఉపన్యాసాలతో ప్రజలను చైతన్య పరిచి భక్తినే ముక్తిని సాధనగా
ఎంచుకొని భక్తి భావముతో అనేకమంది అజ్ఞానుల యొక్క జీవితాలను సరిదిద్దిన మహానుభావులు శ్రీ రామకృష్ణ పరమహంస గారిని,శిష్యుడిని వివేకానందునిగా మార్చిన ఘణత ఈయనకే దక్కుతుందని, వివేకానందుడు గురువు పేరు మీద స్థాపించిన రామకృష్ణమఠం ఇప్పటికి అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని, శ్రీ రామకృష్ణ పరమహంస గారు సమాజ అభ్యున్నతికి ఎన్నో విలువైన సందేశాలను ఇచ్చారని, అన్ని కుల,మతాల సారాంశం ఒక్కటేనని, 'మానవసేవయే మాధవసేవ" అని సందేశమిచ్చిన మహనీయుడని,16-08-1886 మరణించారని, మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని,విధ్యార్థి దశ నుండే ఆధ్యాత్మిక భావనలు అలవరచుకొని దేశానికి సేవ చెయ్యాలని సామాజిక కార్యకర్త డోన్ మహమ్మద్ రఫి ఆశాభవం వ్యక్తం చేశారు.
Home
Unlabelled
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి..... డోన్ సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: