రెండవదశ రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయండి

జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సామూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో చేపట్టిన రెండవదశ రీసర్వే పనుల ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు,మండల తహసీల్ధార్లను జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రీసర్వే, అసైన్మెంట్ భూములు, భూసేకరణ, ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలపై  ఆర్డీఓలు,అన్ని మండలాల తాసిల్దార్లు,ల్యాండ్ అండ్ సర్వే అధికారులతో వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవదశ రీ సర్వే పనుల పక్రియకు సంబంధించి 76 గ్రామాలకు గాను 23 గ్రామాలలో పూర్తయిందని, మిగిలిన 53 గ్రామాలలో ఆగస్టు 31వ తేదీ లోపు రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని మండలాల తాసిల్దార్లు,ల్యాండ్ అండ్ సర్వే  అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 340 సి కి సంబంధించి నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో పెండింగ్ ఉన్న 640 క్లైయిమ్ లను ఆర్డీవోలు,సంబంధిత మండల తాసీల్ధార్లు నాలుగు రోజుల్లో పూర్తి చేసి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే 167 కేకు సంబంధించి కల్వకుర్తి నుండి నంద్యాల వరకు వెలుగోడు, ఆత్మకూరు, బండి ఆత్మకూరు, కొత్తపల్లి, నంద్యాలలలో పెండింగ్ లో ఉన్న కేటగిరిజైషన్ ఆఫ్ ల్యాండ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటి ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఫార్మ్-6 కింద 7,261, ఫార్మ్-7 కింద 5,143, ఫార్మ్-8 కింద 20,574 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటివరకు 63 శాతమే పూర్తయిందని మిగిలిన 37 శాతాన్ని ఈనెల 21వ తేదీలోగా వెరిఫికేషన్ పూర్తి చేసి ఓటర్ల జాబితాలో సవరించాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ పుల్లయ్య,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి హరికృష్ణ,కలెక్టరేట్ లోని సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: