యాప్ ల పేరుతో దోపిడీకి తేరలేపాయి

నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలపై ఎన్ఎస్ యూఐ నేతల ఆరోపణ

డోన్ ఎంఈఓ కు వినతిపత్రం అందజేత

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం డోన్ లోని నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న దోపిడీ చాలదన్నట్లు,కొత్తగా యాప్ ల పేరుతో వేల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకుంటున్నారని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జిల్లానాయకులు విజయకుమార్, నియోజకవర్గ నాయకులు సునీల్,  మధు ఆవేదన వ్యక్తం చేస్తు డోన్ ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు.అనంతరం ఎన్ఎస్ యుఐ నాయకులు విజయ్ కుమార్,సునీల్, మధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన నారాయణ,శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలు మరో కొత్త దోపిడీకి పాల్పడుతుంటే విద్యాధికారులు చోద్యం చూస్తున్నారని,ప్రతి విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక్కో విద్యార్థికి 1500 రూపాయలు యాప్ కోసం చెల్లించాలని విద్యార్థులు తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారని,కానీ విధ్యాధికారులు మాత్రం ఆ కార్పొరేట్ విద్యాసంస్థలపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదని, అయితే గతంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముకుంటుంటే వాటిని ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారని,


కార్పొరేట్ విద్యాసంస్థలపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని,కార్పొరేట్ విద్యా సంస్థలు పుస్తకాలు అమ్ముకుంటున్న విద్యాశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉందని, అటువంటి విద్యాసంస్థలపై ప్రభుత్వ అధికారులకు అంత ప్రేమ ఎందుకో అర్థం కావడం లేదని, విద్యాశాఖ అధికారులు నారాయణ,శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్నారా..? ప్రభుత్వ పాఠశాలల కోసం విద్యాశాఖధికారులుగా పనిచేస్తున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా అధికారులు విద్యాశాఖధికారులు విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీ నుంచి విద్యార్థుల తల్లిదండ్రులను కాపాడాలని, అధిక మొత్తంలో వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సీజ్ చేయాలని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేశారు.రాబోయే రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుండి అధిక మొత్తంలో వసూలు చేసే విద్యాసంస్థలపై ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో శేఖర్,మధు, రవి,జగన్,సాయి, నవీన్ పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: