అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి...... బిఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ లింగాల స్వాములు

అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి

బిఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ లింగాల స్వాములు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని పాములపాడు గ్రామంలో విద్యుత్ సరఫరా కోతల వల్ల రైతులు సాగు చేసుకుంటున్న పంటలు ఎండిపోయి రైతన్నతీవ్రంగా నష్టపోతున్నారనీ,విద్యుత్ సరఫరాను అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించి ఆదుకోవాలని బిఎస్పి అసెంబ్లీ ఇంచార్జ్ లింగాలస్వాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాములపాడు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు విద్యుత్ అంతరాయంతో  రైతంగం తీవ్రంగా నష్టపోతున్నారని బిఎస్పీ పార్టీ అసెంబ్లీఇన్చార్జి లింగాల స్వాములు  ఆధ్వర్యంలో రైతులు  ధర్నానిర్వహించారు. ధర్నాకార్యక్రమాన్ని ఉద్దేశించి అసెంబ్లీ ఇన్చార్జి లింగాల స్వాములు మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోతూ రైతులు అల్లాడుతుంటే మరోవైపు రైతులకు అందించే విద్యుత్ కోతలతో ఇబ్బందులకు గురవుతున్న రైతులను ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. పాములపాడు మండల పరిధిలోని వేలాది ఎకరాలు వర్షాధారంపైనే రైతులు పంటలు సాగు చేసుకుంటే మరి కొంతమంది రైతులు బోరుబావి కింద సాగు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని,


ఒకవైపు వర్షాలు సమృద్ధిగా పడకపోవడం వల్ల వర్షా ఆధారంపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు వేసవికాలం లా తలపించే ఎండలతో బోరుబావి క్రింద పంటలు చేసుకున్న రైతులు ప్రతిరోజు నీరు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటం వల్ల నష్టపోతున్నారని, ప్రభుత్వానికి వీరి బాధలు పట్టవా అని ప్రశ్నిస్తూ, రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసి రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వందలాది రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ప్రసాదం, రైతులు బుడ్డన్న, వెంకటేశ్వర్లు,శివన్న,రమేష్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: