హంద్రీనీవా నుండి కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేయాలి

రైతు, వ్యాకాస నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో హంద్రీనీవా నుండి కేసి కెనాల్ కు నీటిని విడుదల చేసి నీరు లేక ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు అధికారులకు డిమాండ్ చేశారు. భరత్ కాంప్లెక్స్ లో రైతువ్యాకాస ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు మాట్లాడుతూ రైతన్నలు వర్షాలు కురవడంతో నందికొట్కూరు నియోజకవర్గంలో మొక్కజొన్న,పత్తి,మిరప మరియు వరిపంటలు సాగు చేస్తున్నారని,వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతన్నలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని,సుంకేసుల నుంచి కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేయాల్సిన అధికారులు,ప్రజా ప్రతినిధులు ఆగస్టు నెల వచ్చిన నీటిని విడుదల చేయడం లేదని,శ్రీశైలం బ్యాక్ వాటర్ హంద్రీనీవా చేరిన నీటిని విడుదల చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తక్షణమే కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేసి రైతన్నలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని,శ్రీశైలం డ్యాం కు పూర్తి స్థాయిలో నీరు చేరకముందే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పేరుతో నీటిని వాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడంలేదని,


ప్రాజెక్టు నీరును తెలంగాణ ప్రభుత్వం వాడుకోవడం వల్ల ఏపీ రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని,తక్షణమే తెలంగాణ నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు,బుధవారము సాయంత్రం లోపు కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడి రైతన్నలను ఆదుకోవాలని, కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేయకపోతే రైతు వ్యాకాస ఆధ్వర్యంలో రైతన్నలను సమీకరించి గురువారం ముచ్చుమరి నుండి కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు,తక్షణమే అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేయాలని,లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతువ్యాకాస జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, పకీర్ సాహెబ్,బెస్త రాజు, మండల నాయకులు రామకృష్ణ,వెంకటేశ్వర్లు, శేఖర్,నారాయణ,ఏసన్న, నరసింహుడు,లింగస్వామి, రైతులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: