నంద్యాల పట్టణంలోని రెస్టారెంట్లు,హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తనిఖీలు చేపట్టాలి

అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ (ఏఐఎస్బి)రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని కొన్ని హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్ల యాజమాన్యాలు డబ్బు సంపాధనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారనీ, హోటళ్లు, రెస్టారెంట్లలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజలఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారనీ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ (ఏఐఎఫ్బి) రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ విద్యార్ధి, యువజన సమాఖ్య నంద్యాలజిల్లా అధ్యక్షుడు పెరుగు శివకృష్ణ యాదవ్, ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ (ఏఐఎస్బి) జిల్లా అధ్యక్షుడు తెలుగు మహేష్, ఏఐవైఎల్ ప్రధాన కార్యదర్శి చల్లా సురేష్ బాబులు ఆరోపించారు. నంద్యాలలోని హోటళ్లు, రెస్టారెంట్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను స్ధానిక రెవెన్యూ అధికారులు,ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా పాత్రికేయులతో ప్రజా సంఘాలనేతలు రామినేని రాజునాయుడు,పెరుగు శివకృష్ణ యాదవ్,తెలుగు మహేష్,చల్లా సురేష్ బాబులు మాట్లాడుతూ హోటళ్లలో,రెస్టారెంట్లలో సరైన శుభ్రత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ చికెన్ , మటన్ లాంటి మాంసాహార పదార్ధాల్ని ఫ్రిజ్ లో నిల్వఉంచి వాటిని రెండు, మూడు రోజుల వరకు వండి ప్రజలను మోసం చేస్తున్నారని,


ముఖ్యంగా వంట నూనె కూడా ఒక పదార్ధానికి వాడి అదెే నూనెను రకరకాల పదార్ధాలకు వాడుతూ ప్రజల ఆరోగ్యాలను, ఆయుస్సును తగ్గిస్తున్నారని,కుల్లిపోయిన కూరగాయలను మరియు పాడైపోయిన చికెన్ మసాలాలు నకిలీ కారంపొడి,డాల్డా లాంటి నాసిరకం పదార్ధాలు వాడుతున్నారని వాపోయారు. వంట రూములను కూడా శుభ్రపరచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనీ,నాణ్యత లేని బియ్యం వండుతూ ప్రజలను అనారోగ్యాల పాలుచేస్తున్నారనీ, భోజనాల రేట్లు, మాంసాహారాల రేట్లు అధిక ధరలతో విక్రయిస్తున్నారనీ, నంద్యాల జిల్లా కేంద్రానికి నిత్యం వివిధ గ్రామాల నుండి ప్రజలు వస్తుంటారనీ, ఇటువంటి హోటళ్ల,రెస్టారెంట్ల నిర్వాకం వలన డబ్బు నష్టంతో పాటు ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్నారని, నంద్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు నాసిరకంగా ఉన్నాయని ప్రశ్నించినా , ఆహారపదార్ధాలలలో కీటకాలు పడినా ఇదేంటని అడిగిన కస్టమర్లపై దాడులు చేస్తూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ హోటల్  యాజమాన్యాలు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఇలాంటి హోటల్ లపై తక్షణమే నంద్యాలజిల్లా అధికారులు,ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: