నత్తనడక నాడు - నేడు పనులతో...

విద్యార్థులకు తప్పని అవస్థలు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం స్థానిక నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పథకం కింద మంజూరైన రెండవ దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2022 ఆగస్టులో పనులకు స్వీకారం చుట్టి.2023 జులైలో పూర్తి చేస్తామన్న హామీలు మాత్రం మాటలకే పరిమితమయ్యాయి. నాడు-నేడు పనులు నత్త నడకన కారణం ప్రభుత్వ పథకాలలో నిధులలోపమా..అధికారుల నిర్లక్ష్యమా.. కాంట్రాక్టు మొండి వైఖరా అర్థం కాని స్థితిలో నాడు నేడు పథకం పనులు కొనసాగు తున్నాయి.


ఇందుకు నిదర్శనం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో రాష్ట్రప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సౌకర్యార్థం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనులు సాగుతున్నాయి. నాడు- నేడు పనులు పూర్తి కాకపోవడానికి కారణం నిధులలోపమా.. అధికారుల నిర్లక్ష్యమా..గుత్తేదారి మొండివైకరా. . అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షం పడితే చాలు ప్రాథమిక పాఠశాల ఆవరణం మొత్తం బురదమయంగా మారుతుంది.నాడు-నేడు పనుల కింద తీసుకువచ్చిన 
మరమ్మతల సామాగ్రితో విద్యార్థులు విశ్రాంతి సమయాలలో ఆటలు ఆడుకొను సమయంలో విద్యార్థులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యాలయాలలో మరమ్మత్తుల పనులు నత్త నడకన సాగుతుండడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం,

ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచి,ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకం ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ లోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మాణవస్తు సామగ్రి,వ్యర్థ పదార్థాలు విచ్చలవిడిగా పడవేయడంతో పాఠశాల విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు.ప్రహరీ గోడ  పునాదుల్లోనే నిలిచిపోయి దర్శనమిస్తుంది. పాఠశాల ఆవరణంమట్టి, నిర్మాణ సామగ్రితో ఉండడం, చినుకు పడితేచాలు పాఠశాల ప్రాంగణమంతా బురదమయంగా మారి పాఠశాల ఆవరణలో అడుగు పెట్టడానికే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల చదువు,క్రీడలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. పాఠశాల గదులన్నీ శిథిలావస్థకు చేరడం తో విద్యార్థులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాడు- నేడు పనులు కొంతవరకు సాగినా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో రెండు నెలలుగా ఆపేశారు. అర్ధంతరంగా ఆగిన  ప్రాథమిక పాఠశాలలో సిమెంటు బస్తాలు దుమ్ములో, నిర్మాణ సామాగ్రి మధ్యనే విద్యార్థులు విద్యను అభ్యసించడానికి అరచేతిలో పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే నాడు- నేడు పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: