అలగనూరు రిజర్వాయర్ ను సందర్శించిన.....గౌరు దంపతులు

(జానో జాగో వెబ్  న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం వైసీపీ ప్రభుత్వం చేపడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నందికొట్కూర్ టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకట్ రెడ్డి మరియు టిడిపి పాణ్యం ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి అలగనూరు రిజర్వాయర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గౌరు దంపతులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రభుత్వం హాయంలో 1982 లో అలగనూరు రిజర్వాయర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారని,టిడిపి హయంలో 1995 లో అలగనూరు రిజర్వాయర్ నిర్మాణం 57 కోట్లతో నిర్మాణం జరిగిందని, అలగనూరు రిజర్వాయర్ ద్వారా నీరు కేసీ కెనాల్ ద్వారా నంద్యాల జిల్లా నుండి కడప జిల్లా వరకు కేసీ కెనాల్ ద్వారా పంటలు పండించుకునే రైతన్నలకు 1,73,000 ఎకరాలు,93,000 ఎకరాలు ఉన్నాయని,


అలగనూరు రిజర్వాయర్ ద్వారా మత్స్యకారులు అనేకమంది జీవించేవారిని, 2019 లో అలగనూరు రిజర్వాయర్ కట్టకుంగడంతో మూడు కోట్లతో నిర్మాణ మరమ్మతులు జరిపించక రివర్స్ టెండరింగ్ అంటూ ఎక్సెస్స్ టెండర్ల ద్వారా 26 కోట్లకు మరమ్మత్తులకు ప్రభుత్వం టెండర్ లకు పిలిచిందని,57 కోట్లతో అలగనూరు రిజర్వాయర్ నిర్మాణం జరిగితే రిజర్వాయర్ కట్ట కుంగిన ప్రాంతంలో ప్రాంతంలో 26 కోట్లతో టెండరింగ్ పిలిచారంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు కాదని ప్రశ్నించారు.వెంటనే ప్రభుత్వం అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులు చేసి రైతులకు సాగునీటి, కడపకు తాగునీరు అందేలా చూడాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు పెద్దపీట వేశారని,గత నాలుగు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం ప్రాజెక్టుల మరమ్మతుల నిర్మాణం చేపట్టకుండా రైతన్నలను మరిచారని విమర్శించారు ఈ కార్యక్రమంలో గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, మిడ్తురు మండలం టిడిపి కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ,రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి సుభద్రమ్మ,పెసరవాయి లక్ష్మీదేవమ్మ,తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, మంచాలకట్ట మురళి రెడ్డి, కరిమద్దేల ఈశ్వర్ రెడ్డి, తలముడిపి కశ్వశంకర్ రెడ్డి,టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు రైతన్నలు పాల్గొన్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: