మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటే భవిష్యత్తులో,,,,
మీరే ఐపీఎస్,ఐఏఎస్ అధికారులు
జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి చైర్మన్ పర్ల దస్తగిరి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ మారుతి సహకారంతో సిరివెళ్ల మండలంలోని స్థానిక కస్తూరిబా పాఠశాల నందు ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్స్ లో వచ్చే ఫేక్ యాపులకు,లోన్ యాప్ లకు స్పందించ వద్దని మొబైల్ ఫోన్స్ కు దూరంగా ఉంటే భవిష్యత్తులో ఐపీఎస్,ఐఏఎస్ అధికారులు కావచ్చునని, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే దిశ ఆఫ్ గురించి ముఖ్యంగా బాలికల సంరక్షణ భవిష్యత్తు బంగారు బాటగా ఉండాలంటే ఇప్పటినుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని,
బాలికలకు మంచి విద్య నేర్పడానికి సహకరిస్తూ ఎలాంటి సేవాకార్యక్రమాలను చేయడానికైనా పోలీసుశాఖ ఎప్పటికీ ముందుంటుందని, విద్యార్థులు మంచి ప్రతిభ సాధించడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని, అవసరమైతే రెడ్ క్రాస్ సంస్థల సహకారంతో పోలీసుశాఖ సమన్వయంతో కస్తూర్బా స్కూల్స్ కు విద్యా పరంగానే కాకుండా అన్ని రకాల సహాయ సహకారాలు భవిష్యత్తులో అందిస్తామని హామీ ఇచ్చారు.రెడ్ క్రాస్ వైస్ చైర్మన్,సెవెన్ హిల్స్ హాస్పిటల్,కాత్యాయని గ్రూప్ అధినేత మారుతి కుమార్ మాట్లాడుతూ
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మా సెవెన్ హిల్స్,కాత్యాయని గ్రూప్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని ఉపాధ్యాయ బృందం మమ్మల్ని కలిసి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా విద్యార్థులకు అవసరమయ్యే పరికరాలు అడగడం చాలా సంతోషకరమైన పరిణామని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ పర్ల దస్తగిరి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి సహకారంతో పోలీస్ శాఖ వారితో సభ్యత్వ నమోదు చేయించడమే కాకుండా పోలీస్ శాఖ సమన్వయంతో అన్ని పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనల గురించి, సత్ప్రవర్తన, మంచి నడవడిక,రక్త గ్రూపులపై అవగాహన తదితర అంశాలపై అన్ని పాఠశాలలు కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థినుల సౌకర్యార్థం రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ కాత్యాయని,సెవెన్ హిల్స్ హాస్పిటల్ గ్రూపు అధినేత మారుతి కుమార్ గారు విరాళంగా అందించిన ఇన్వర్టర్ ను ప్రారంభించి స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటడం జరిగిందని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా కార్యవర్గ సభ్యులు తెలకపల్లి చైతన్య, సిరివెళ్ల మండల నాయకులు ఎర్రగుంట్ల మద్దిలేటి, డిఎఫ్ఓ రాజు నాయక్, కస్తూరిబా స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిరివెళ్ల ఎస్ఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటే భవిష్యత్తులో,,,,
మీరే ఐపీఎస్,ఐఏఎస్ అధికారులు.......
జిల్లా ఎస్పీ శ్రీ రఘువీర్ రెడ్డి చైర్మన్ పర్ల దస్తగిరి
Post A Comment:
0 comments: