అంగనవాడి సెంటర్  ప్రహరీ గోడ కూల్చిన,,,,

గ్రామ పంచాయితీ ఈఓ పై చర్యలు తీసుకోవాలి

సిఐటియు, ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం బస్టాండ్ లో ఉన్న 7 వ అంగన్వాడి కేంద్రం 17 సంవత్సరాల కిందట  నిర్మాణం చేపట్టారని, అప్పట్లో నిర్మాణం చేపట్టడానికి విధులు నిర్వహిస్తున్న అధికారులు పర్మిషన్ ఇచ్చారని, ఇప్పుడు రహదారికి  అడ్డుగా ఉన్నదని కేవలం ఒక వ్యక్తి స్పందన కార్యక్రమంలో అర్జీ పదేపదే ఇస్తున్నారని,నోటీసులు ఇవ్వకుండా ప్రహరీ గోడను కూల్చడం ఎంతవరకు సమంజసమని, పాణ్యంలో ఎన్నో స్థలాలను రాజకీయ నాయకుల అండదండలతో షాపులు కేటాయించుకొని  గ్రామపంచాయతీకి


ఒక్క రూపాయి రుసుము కట్టకుండా వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని,కేవలం విద్యార్థులపైనే కక్ష చూపించడం,ఎవరు అడిగే వారు లేరనే స్వార్థంతోనే  రాజకీయ నాయకుల అండదండలతో అంగన్వాడి ప్రహరీ గోడను కుల్చారని,జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేసి గతంలో  నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని, నోటీసులు ఇవ్వకుండా అంగన్వాడీ ప్రహరీ గోడను కూల్చిన గ్రామపంచాయతీ అధికారికి నోటీసులు ఇవ్వాలని, ఉపాధ్యాయురాలు ప్రహరీ గోడను కూల్చావద్దు అని బతిమిలాడిన ఉపాధ్యాయురాలుని తోసివేసి ప్రహరీ గోడను కూల్చారని,

పాణ్యంలొ విధులు నిర్వహిస్తున్న అధికారులకు దయ, కనికరం,అడ్డు అదుపు లేకుండా పోయిందని, స్వార్థప్రయోజనం కోసం ప్రహరీ గోడను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ఎస్ఎఫ్ఐ నాయకులు బత్తిన ప్రతాప్, సిఐటియు నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు పాణ్యం తహసిల్దార్ మల్లికార్జునరెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సిఐటియు బత్తిన ప్రతాప్ భాస్కర్ లు మాట్లాడుతూ విద్యార్థులుకు న్యాయం జరగపొతే ఎస్ఎఫ్ఐ, సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలొ అంగనవాడి టీచర్లు,వెంకటమ్మ,మాబున్నిసా,అనిత,అనసూయ పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: