కలెక్టర్ ఛాంబర్ లో  ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే

నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

 (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఉత్తర్వుల నెం.1233 లోని ఆదేశాల మేరకు ప్రతినెల 3 వ శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే లో భాగంగా 18-08-23 వ తేదీ కలెక్టర్ ఛాంబర్ లో ఉద్యోగుల గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, దరఖాస్తులతో 18-08-23 వ తేదీ ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో సంప్రదించాలని,ప్రతి ఉద్యోగి తన దరఖాస్తులో సిఎఫ్ఎంఎస్ ఐడి తప్పనిసరిగా వేయాలని సూచించారు,ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉద్యోగుల గ్రీవెన్స్ డే ను నిర్వహిస్తోందని తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: