బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న పేద చిన్నారి

దాతలు ఆదుకొంటేనే ఆ చిన్నారికి భవిష్యత్తు

ఆపన్న హస్తం కోసం ఆశతో ఎదురుచూస్తున్న..... తల్లిదండ్రులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)   

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని కరిమద్దేల గ్రామానికి చెందిన తిమ్మాపురం సామన్న, రమాదేవి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. అందులో చిన్న కుమార్తె అయిన జయలక్ష్మి 2013 లో జన్మించింది. 2018 వ సంవత్సరంలో తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండడంతో తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి పరీక్షలు చేయించగా కర్నూలు వైద్యశాల వైద్యులకు అనుమానం వచ్చి హైదరాబాదులోని ఎం యన్ జే ఆసుపత్రి వారి వద్దకు పంపించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జయలక్ష్మి కి అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) వ్యాధి ఉందని నిర్ధారించారు. 


లుకేమియా వ్యాధి ఉండడంతో పాపకు రక్తహీనత ఏర్పడి రక్త కణాలు తగ్గిపోతుండడంతో జయలక్ష్మి కి రక్తం ఎక్కించడానికి తల్లిదండ్రులకు నెలకు 4000 నుండి 5000 వరకు ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కూలి పనికి వెళ్లి జీవనోపాధి చేసుకుంటు ఉండడంతో కుటుంబ పోషణ అధిక భారమైందని కన్నీరు మున్నిరు అవుతున్నారు. మా దయనీయ పరిస్థితిని చూసి సహృదయంతో దాతలు ఎవరైనా ఆర్థిక సహాయం చేయదలచిన వారు 9642567917 నెంబర్ ను సంప్రదించవలసినదిగా తిమ్మాపురం సామన్న, రమాదేవిలు అర్థిస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: