గడివేములలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)              

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలో ఘనంగా 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ స్కూల్,  మోడల్ స్కూల్, శ్రీ రాజరాజేశ్వరి హైస్కూల్, ఎంపీడీవో కార్యాలయం, తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, గ్రామవార్డు సచివాలయాలలో, సిఐటియు ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు, సెయింట్ పాల్ స్కూల్, మండలములోని ప్రభుత్వ పాఠశాల నందు మరియు గ్రామ వార్డు సచివాలయంలో నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.


ఈ సందర్భంగా భారతదేశ స్వేచ్ఛ,స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహనీయులను, నాయకులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వరి హై స్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తిని చాటుకున్నారు. వారి కార్యక్రమాలు ఎంతగానో అలరించారు. అనంతరం గడివేముల గ్రామ ప్రధాన పురవీధుల్లో పాఠశాల కరస్పాండెంట్ రామేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థిని,

విద్యార్థులతో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు చిన్నతనం నుండే దేశభక్తిని పెంపొందించుకోవాలని, విద్యార్థులలో దేశభక్తి పెంపొందించుకునేందుకు పాఠశాలలో తమ వంతు కృషి చేస్తామని రాజరాజేశ్వరి కరస్పాండెంట్ రామేశ్వరావు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: