యువకులను చితకబాదిన పోలీసులను సస్పెండ్ చేయాలి

సిపిఎం నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని మల్యాల గ్రామానికి చెందిన అశోక్, మహేష్ లను చితకబాదిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు, సిపిఎం నాయకులు పకీరు సాహెబ్,గోపాలకృష్ణ డిమాండ్ చేశారు,శనివారం రాత్రి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అశోక్,మహేష్ లను పరామర్శించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరావు,సిపిఎం నాయకులు పకీర్ సాహెబ్,గోపాలకృష్ణ మాట్లాడుతూ మల్యాల గ్రామానికి చెందిన అశోక్ మహేష్ తండ్రి అయిన వెంకటేశ్వర్లు పై అన్న పుల్లయ్య 2022 లో ఘర్షణ పెట్టుకొని హత్య చేయడం జరిగిందని,సంఘటన జరిగిన తర్వాత పుల్లయ్యను పోలీసులు ఊరి నుండి వెలియడం జరిగిందిని అన్నారు, శుక్రవారం పుల్లయ్య మల్యాల గ్రామానికి వెళ్లి పొలం దగ్గర పని చేసుకుంటున్నటువంటి పద్మావతి,


అశోక్,మహేష్ ను పొలంలో పని చేసుకుంటుండగా పుల్లయ్య వారి దగ్గరికి వెళ్లి ఘర్షణ పెట్టుకోవడంతో  నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనడంతో వెంటనే వారిపై ఘర్షణ పడడంతో అశోక్,మహేష్ కలిసి తోసివేయడంతో పుల్లయ్య వెంటనే నన్ను కొట్టినారు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వెంటనే నందికొట్కూరు సిఐ గారు ఐదు మంది పోలీసులను పంపించి అశోక్ మహేష్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి లాకప్పులో పెట్టి పుల్లయ్య సమక్షంలోనే సిఐ, పోలీసులు మరియు హోంగార్డులు కలిసి అశోకుని,

మహేష్ ను లాటీ లతో బూట్లతో తన్ని నానా హింసలు గురిచేసి,బట్టలు విప్పదీసి రాత్రి,పగలు లాకప్పులో పెట్టడం జరిగిందన్నారు, యువకులను విచక్షణ రహితంగా కొట్టిన నందికొట్కూరు సీఐ, పోలీసులు మరియు హోంగార్డులపై జిల్లా ఎస్పీ గారు వెంటనే విచారన జరిపించి అశోకు,మహేష్ లను చితకబాదిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు,లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మద్దిలేటి, కళావతి,మురళి పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: