బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ
పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం, పాణ్యం మండలం భూపనపాడు గ్రామంలో మహాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన మినీ మేనిఫెస్టో,సూపర్ సిక్స్ పధ కాలు ప్రకటించడంతో ఇంటింటికీ తిరిగి ప్రతి కుటుంబానికి కరపత్రాలను అందజేస్తూ గ్రామంలోని మహిళకు పథకాల గురించి వివరిస్తు పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా భూపనపాడు గ్రామంలోని బిసి కాలనిలోని ప్రజలు రోడ్లు,డ్రైనేజీ సమస్యలతో ప్రజలు రొడ్లపై నడవలేక ఇబ్బంది పడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు.
కొన్ని నెలల క్రితం భూపనపాడు గ్రామానికి వచ్చిన పాణ్యo వైసిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రావడంతో గ్రామస్థులు అందరూ ఊరులోకి రాకుండా అడ్డగించి గెలిచి 4 సంవత్సారాలు అయినా మా ఊరికి ఎంఅభివృద్ధి చేశారని, బిసి కాలనిలో రోడ్లు డ్రైనేజీతో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసి గ్రామస్థులు ఊరిలోకి రాకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్నామని, మహాశక్తి కార్యక్రమానికి భూపన పాడు గ్రామానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి బిసి కాలానికి చెందిన మహిళలు, గ్రామస్థులు స్వాగతం పలికి బిసికాలని లో పర్యటించిన అనంతరం గౌరు చరిత రెడ్డి బిసికాలని ప్రజలతో మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో గృహాలు కట్టిన ఘనత లేదని, తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం వస్తేనే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతో సాధ్యమని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్ర బాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవాలని,
గ్రామంలోని బిసి కాలనిలోని ప్రజలు రోడ్ల పై డ్రైనేజీ నీళ్ళు వచ్చి తిరగకుండా ఇబ్బందులు పడుతున్నారని అని, గెలిచిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని గ్రామస్థులకు గౌరు చరిత రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నారాయణమ్మ, భూపనపాడు మాజీ సర్పంచ్ హనుమంతు, సునీల్,వెంకటసుబ్బయ్య, విజయుడు, మల్లికార్జున, మండల నాయకులు రమణమూర్తి, లాయర్ బాబు, ఆలమూరు చంద్ర శేకర్ రెడ్డి, బీటెక్ పుల్లారెడ్డి, నేర్వాడ అమర సింహ రెడ్డి, నియోజకవర్గ టీడీపీ యస్సీ సెల్ అధ్యక్షుడు దానం,ఈశ్వర్ రెడ్డి, గొనవరం రాజేష్, ఖాదర్, టీడీపీ నాయకులు కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
Home
Unlabelled
బీసీ లకు అండగా తెలుగుదేశం పార్టీ.... పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: