ఈ నెల 23 వ తేదీన జంప్ రోప్ పోటీలకు ఎంపికలు
సెక్రెటరీ పకీరయ్య
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో సబ్ జూనియర్ బాల బాలికలకు,జూనియర్ బాల బాలికలకు మరియు సీనియర్ బాల బాలికలకు జంప్ రోప్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికలు జరుగుతాయని జంప్ రోప్ సెక్రెటరీ పకీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,,,నంద్యాలజిల్లా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో జంప్ రోప్ ఎంపిక 23-08-23 వ తేదీన నంద్యాల జిల్లా స్థానిక పద్మావతినగర్ లోని డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామని, నంద్యాల జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవలసిందిగా నంద్యాల జిల్లా జంప్ రోప్ సెక్రటరి పక్కిరయ్య తెలిపారు.నంద్యాల జిల్లా లో సెలక్షన్ ఎంపికైన జంప్ రోప్ క్రీడాకారులు వచ్చేనెల 09-09-2023 మరియు 10-09-2023 తేదీలలో గుంటూరు జిల్లా తెనాలిలో జరుగు రాష్ట్రాస్థాయి పోటీలలో పాల్గొంటారని, నంద్యాల జిల్లాలోనిఆసక్తి గల క్రీడాకారులు ఎవరైనా జంప్ రోప్ జిల్లా స్దాయి సెలక్షన్ లో పాల్గొన్న వచ్చునని సెక్రెటరీ పకిరయ్య తెలిపారు. సెక్రెటరీ పక్కిరయ్య Cell: 9704085139
Home
Unlabelled
ఈ నెల 23 వ తేదీన జంప్ రోప్ పోటీలకు ఎంపికలు.... సెక్రెటరీ పకీరయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: