గడివేముల మండలంలో ఈక్రాప్ బుకింగ్ నమోదు.... ఖరీఫ్ 23 ప్రారంభం

వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని రైతన్నలు 9762 ఎకరాలలో వివిధ పంటలైన సోయాబీను, పత్తి, వరి ,మినుము, కంది, మరియు ఇతర పంటలు వేశారని, రైతు సోదరులందరూ ఈ సంవత్సరము ఖరీఫ్ లో సాగు చేసిన పంటలను తప్పనిసరిగా ఈక్రాపు బుకింగ్ చేసుకోవాలని, రైతుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము,ఆధార్ కార్డు,1బి,ఫోన్ నెంబరు, అప్లికేషన్ ఫామ్ లో రైతు పేరు, చిరునామా నీటి ఆధారమా లేక వర్షాధారమా, పంటరకము, పూర్తి చేసి సంతకం చేసి ఇవ్వలని, కొత్తగా సర్వే నెంబర్లు జియో ట్యాగ్ ఇంగ్ ద్వారా గుర్తించబడినవని,


ప్రతి ఒక్క రైతు పంట వేసి న ప్రతి సర్వే నెంబరు పొలం దగ్గరికి వ్యవసాయ శాఖ,రెవెన్యూ మరియు రైతు సమక్షంలో ఫోటో జియో కోఆర్డినేట్ ఆధారంగా పొలంలోకి, పొలము దగ్గరికి,వెళ్తేనే యాప్ లో ఫోటోలు తీసుకోవడానికి వీలు అవుతుందని, రైతు విధిగా వేలిముద్ర వేయాలి లేదా ఫోన్ నెంబర్ కి ఆధార్ లింక్ అయిఉంటే ఓటీపీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చునని,రైతు సోదరులందరూ ఆర్పీకే సిబ్బందిని సంప్రదించి త్వరితగతిన ఈ క్రాప్ పంట నమోదు చేసుకుని రైతన్నలు సహకరించాలని గడివేముల మండలం వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: