జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు సమిష్టిగా కృషి చేసి......
ఈ కేవైసీ సెప్టెంబర్ 15 లోగా పూర్తి చేయండి
జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను సూచించారు. కలెక్టరేట్ లోని వైయస్సార్ సెంటినరీ హాలులో జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గారితో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు వేసుకున్న పంటలను కాపాడుకుంటూ ఇంకా సాగు చేయని పొలాల్లో ప్రత్యమ్నాయ పంటలు వేసుకునేలా రైతులకు సవివరంగా వివరిస్తూ, ప్రోత్సహిస్తూ జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని అధికారులను సూచించారు.సాగునీటి కాలువలు,మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పరివాహక ప్రాంతాల్లో రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.వరి పంటకు బదులు మొక్కజొన్న,జొన్న,చిరుధాన్యపు పంటలు వేసుకునేలా చూడాలన్నారు.పాడి రైతులకు వెటర్నటి డాక్టర్లు అందుబాటులో ఉండేలా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని,ఉద్యానశాఖ ద్వారా విదేశీ మాదకద్రవ్య కొత్తవాణిజ్య పంటలను అన్వేషించి రైతులు వేసుకునేలా ప్రోత్సహించాలని,ఆయిల్ ఫామ్ సంబంధించి సన్ఫ్లవర్, కుసుమనూనె సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ అధికారి నాగరాజు కు సూచించారు.
జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల వేసిన పంటకు ఈక్రాప్ బుకింగ్ తో పాటు ఈకేవైసీ సెప్టెంబర్ 15 లోపల పూర్తిస్థాయిలో చేయాలని సంబంధిత వ్యవసాయ అధికారులను ఆదేశించారు.పగిడ్యాల,పాణ్యం,గడివేముల మండలాల్లో ఇప్పటివరకు ఈక్రాఫ్ బుకింగ్ చేపట్టకపోవడానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని,జిల్లాకు కేటాయించిన 21 వేల సిసిఆర్సి కార్డుల పంపిణీ లక్ష్యాన్ని అధిగమించేందుకు వ్యవసాయ అధికారులు కృషి చేయాలని, ప్రత్యామ్నాయ పంటలకు అవసరమయ్యే విత్తనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్ అధికారులను సూచించారు.
రైతులకు అవసరమయ్యే సూచనలు సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ ఏడీఏలు, గ్రామ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని తెలిపిన అనంతరం లబ్ధిదారులకు విత్తనాల కిట్లను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు,ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, మార్కెటింగ్,మార్క్ఫెడ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Home
Unlabelled
జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు సమిష్టిగా కృషి చేసి...... ఈ కేవైసీ సెప్టెంబర్ 15 లోగా పూర్తి చేయండి...... జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: