దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన,,,
అమరుల త్యాగాలు మరవలేనివి
జానో జాగో సంఘం ఆధ్వర్యంలో ఘటనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆగస్టు 15ను పురష్కరించుకొని జానో జాగో సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారంనాడు నంద్యాలలోని క్రాంతి నగర్ గేట్ దగ్గర శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఆగ్రో ఏజెన్సీస్ వారి సౌజన్యంతో రైతు సోదరులు, కంపెనీ ప్రతినిధులు, స్థానిక ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేడం రామ్ రెడ్డి, జానో జాగో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలంతో మనం ఈరోజు స్వేచ్ఛ వాయువు పిల్చుకొంటున్నామన్నారు.
దేశ ప్రజలంతా ఈ రోజు పండగల స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనందకరమని వారు పేర్కొన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారని, వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోమని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేయు అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి కె పార్థసారధి రెడ్డి, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి ఈ బాల చంద్రారెడ్డి, గోస్పాడు వైఎస్ఆర్సిపి యువ నాయకుడు సి. వంశీధర్ రెడ్డి, ఐ. రామ్మోహన్ రెడ్డి, రాజా రామ్ వాల్మీకి, యువ నాయకుడు అనిల్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.
Home
Unlabelled
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన ,,,, అమరుల త్యాగాలు మరవలేనివి,,,, జానో జాగో సంఘం ఆధ్వర్యంలో ఘటనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: