ఆగస్టు 2023

 200 వ రోజులకు చేరిన యువగళం...

సంఘీభావ ర్యాలీ నిర్వహించిన గౌరు వెంకట రెడ్డి దంపతులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

రాష్ట్రంలో వైసిపి పాలనపై సమరభేరి మోగిస్తూ ప్ర‌జాచైత‌న్య‌మే ల‌క్ష్యంగా నారా లోకేష్ ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర పోలవరం నియోజకవర్గం సీతంపేట వద్ద 200 వ రోజున 2700 కి.మీ.ల మైలురాయిని చేరుకున్న సంద‌ర్భంగా వైసీపీ స‌ర్కారు వివిధ వర్గాల ప్రజలపై బనాయించిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఎత్తేస్తానని హామీ ఇస్తూ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత నారా లోకేష్ కు మద్దతుగా నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి  ఆధ్వర్యంలో 200 రోజుల సంఘీభావ ర్యాలీని కర్నూలులోని గౌరు దంపతుల స్వగృహం నుండి నంద్యాల చెక్ పోస్టు వరకు నందికొట్కూరు పాణ్యం నియోజకవర్గంలోని టిడిపి మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో కార్యకర్తలతో అభిమానులతో పాదయాత్ర నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.


అనంతరం గౌరు దంపతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని తెలిపారు. అనంతరం గౌరు వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో నందికొట్కూరు, పాణ్యంనియోజకవర్గాల్లోని టిడిపి మండల కన్వీనర్లు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు,అభిమానులు దాదాపు 200 మంది స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.


 

 ఖరీఫ్ పంటలు నమోదుకు సెప్టెంబర్ 15 చివరి తేదీ... 

గడివేములమండల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల యందు ఈక్రాప్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనదని గడివేముల మండల వ్యవసాయశాఖ అధికారి హేమసుందర్ రెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్తే రైతు సోదరులు ఈక్రాప్ బుకింగ్ కొరకు అప్లికేషన్ ఫారంలో ఆధార్ కార్డు, వన్ బి, బ్యాంక్ అకౌంట్ బుక్, సంతకం, ఫోన్ నెంబర్ వేసి రైతు భరోసా కేంద్రంలోని సిబ్బందికి ఇవ్వాలని,2023 సంవత్సరం నుండి కొత్తగా జియో రిఫరెన్స్ ఆధారంగా సర్వే నెంబర్లు గుర్తించడం జరుగుతుందని, రైతు సోదరులకు సంబంధించిన ప్రతి సర్వే నెంబర్ ను పొలం దగ్గరికి తీసుకొని వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది సహాయంతో ప్రతి సెంటు పొలాన్ని కూడా నమోదు


చేసుకోవాలని,ప్రతి సర్వే నెంబరు దగ్గరికి రైతు సోదరులు పోతేనే నమోదుకు వీలవుతుందని, రైతు సోదరులు ప్రతి సర్వే నెంబర్ ను దగ్గరుండి పంట నమోదు చేసుకోవాలని, రైతన్నలు వేలిముద్ర వేసి లేదా ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్ ద్వారా ఓటిపి చెప్పి ఈకేవైసీ చేసుకోవాలని, ఖరీఫ్ పంటలు నమోదు చేసుకునే ప్రక్రియ 15-09-23 వ తేదీన ముగుస్తుందని గడివేముల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి తెలిపారు.


 ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందు అందించే...

బత్తిని హరినాథ్ గౌడ్ మృతి పట్ల....

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం 


(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేప మందు అందించే బత్తిని హరినాథ్ గౌడ్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం ప్రకటించారు. బత్తిని హరినాథ్ గౌడ్ వంశపారంపర్యంగా వారి కుటుంబం తయారుచేసే చేప మందు మృగశిరకార్తె రోజున అందించి అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు  ఉపశమనం కలిగిస్తున్నారని, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందడం తనకు తీవ్ర బాధకు గురిచేసిందని బండారు దత్తాత్రేయ తెలియజేసారు. దేశవ్యాప్త ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు వీరు అందించిన నిస్వార్ధ సేవ అందించి అందరి మన్ననలు పొందారని,  వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని బండారు దత్తాత్రేయ  ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. బత్తిని హరినాథ్ గౌడ్  మృతి పట్ల సంతాపం ప్రకటించిన బండారు దత్తాత్రేయ వారి  ఆత్మకు శాంతి చేకూర్చాలని,  వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కష్ట సమయాన మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలియజేసారు.

 బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా...

దోరేటి ఆనంద్ గుప్తా నియామకం

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా దోరేటి ఆనంద్ గుప్తా నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆనంద్ తో మాట్లాడుతూ  తనకు ఈ బాధ్యతల అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దోరేటి ఆనంద్ గుప్తాకు ఆయన శ్రేయోభిలాషులు పార్టీ మిత్రులు అభినందనలు తెలిపారు.

 వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్న...

గోనవరం వైసిపి ఉపసర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యo నియోజకవర్గం పాణ్యం మండలంలోని గోనవరం గ్రామంలో మహాశక్తి కార్యక్రమం మరియు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని పాణ్యo  మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి నిర్వహించారు. గోనవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన భవిష్యత్తు కు గ్యారంటీ కార్యక్రమం లో పాల్గొన్నందుకు వచ్చిన గౌరు చరిత రెడ్డికి ప్రజలుఘనస్వాగతం పలికారు. అనంతరం గోనవరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలతో,కరపత్రాలను పంపిణీ చేస్తూ ఇంటింటికీ తిరిగి పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ,ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడుతూ టిడిపిని అధికారంలోకి తీసుకొని రావాలని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రజలను గౌరు చరిత రెడ్డి కోరారు.

గోనవరం గ్రామంలో ప్రజలతో టిడిపి పథకాలను వివరిస్తున్న గౌరు చరిత రెడ్డి

 

మహాశక్తి కార్యక్రమం మరియు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరు చరిత రెడ్డి సమక్షంలో గోనవరం వైసీపీ ఉప సర్పంచ్ పెద్దింటి సాహెబ్ బాషా, వార్డ్ మెంబర్లు, మందుల మౌలాలి, జాబీర్హుస్సేన్, ఫిదాహుస్సేన్, మాలన్బి లతోపాటు దాదాపు 50 కుటుంబాలు వైసీపీని వీడి గౌరు చరితారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా వారిని టిడిపి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, గోనవరo గ్రామ నాయకులు దానం,  రాజేష్, మల్లారెడ్డి, నారాయణ, సురేషు, మండల నాయకులు నియోజవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు దానం, రమణమూర్తి, లాయర్ బాబు, ఎంపీటీసీ రంగరమేష్, గోరుకల్లురవి, కొనిదేడు రాంపుల్లారెడ్డి, ఆలమూరు చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పాణ్యం మండల కేంద్రం లోని బస్టాండ్ సమీపంలో ఉన్న 7వ అంగన్వాడీకేంద్రం ప్రహరీ గోడను కూల్చిన ప్రాంగణాన్ని పరిశీలించి, ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగ సుంకమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పాణ్యం అంగన్వాడి సెంటర్ ప్రాంగణాన్ని కూల్చిన ప్రదేశం గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న గౌరు చరితరెడ్డి 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రహరీ గోడ రహదారికి అడ్డంగా ఉందని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని, 17 సంవత్సరాల నుండి కొనసాగుతున్న ప్రభుత్వ అంగన్వాడి ప్రహరీ గోడను కూల్చడం అన్యాయమని, రాజకీయ దురుద్దేశంతోనే ప్రహరీ గోడను కూల్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, నిర్మాణ సమయంలో ఆక్రమణకు గురైనదా లేదా అని పరిశీలించకుండా, అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు జయరాంరెడ్డి, ఎంపిటిసి రంగారమేష్, టిడిపినాయకులు రమణమూర్తి, లాయర్ బాబు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 గడివేముల మండల రైతన్నల కేబుల్ వైర్ల పై కన్నేసిన.,

కేబుల్ వైర్ల దొంగలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)                       

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలో రైతు సోదరుల కేబుల్ వైర్లపై కన్నేసిన కేబుల్ వైర్ల దొంగలు.గడివేముల మండలంలోని కుందూనది పరివాహక ప్రాంతాలలో మోటార్ల నుండి బోర్డుల వరకు కరెంటు సప్లై చేసుకోనే కేబుల్ వైర్లను గత వారంరోజుల నుండి కేబుల్ వైర్ల దొంగలు దొంగలించుకుని వెళ్తున్నారు. రైతుసోదరులకు వర్షాలు పడక పంటలకు నీరు అందక లబోదిబోమని బాధపడుతున్న వేళ రైతు సోదరులకు "మూలిగే నక్క మీద తాటికాయపడినట్టు" కేబుల్ దొంగలు రైతన్నల మీద పడి వారిని మరింత నష్టాలకు గురి చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కేబుల్ వైర్ ధర ఒక మీటరు 90/- నుండి100/-లభిస్తుంది. కుందూనది పరివాహక ప్రాంతాలలో రైతు సోదరులు స్టార్టర్ బాక్స్ నుండి మోటారుకు కరెంటు సప్లై చేసుకొని,నీటిని తమ పొలాలకు మళ్ళించుకుని పంటలు పండించుకునేందుకు దాదాపు100 మీటర్ల నుండి 200 మీటర్లు పైగా అవసరం పడుతుండడంతో కేబుల్ వైర్లను రైతన్నలు కొనుగోలు చేసి కరెంటు కనెక్షన్లను తీసుకుంటున్నారు. బోర్డు నుండి విద్యుత్ మోటార్ వరకు కరెంటు సప్లై కొరకు తీసుకున్న వైరును పొలంలో ఎవరూ లేని సమయంలో కేబుల్ వైర్లను కేబుల్ దొంగలు దొంగలించుకుని వెళుతున్నారని రైతు సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ అధికారులు మరియు సిబ్బంది కేబుల్ వైర్ల దొంగలపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని రైతు సోదరులు కోరుకుంటున్నారు.

 ఆనై లైన్ మోసాలకు గురైన బాధితులు

ఈ నెంబర్ కు 9154987020 కు ఫోన్ చేయండి

 జిల్లాఎస్పీ కే.రఘువీర్ రెడ్డి(ఐపీఎస్)

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

ఆన్ లైన్ మోసాలకు గురైన బాధితులు న్యాయం కోసం తమ ఈ 9154987020  నెంబర్ కు ఫోన్ చేయాలని జిల్లా ప్రజలకు నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి కోరారు. పోలీస్ స్పందన ఫిర్యాదుల గురించి, సెంట్రల్ కంప్లైంట్ సెల్ (సిసిసి)గురించిన సమాచారం తెలుసుకొనుటకు, శాంతిభద్రతలకు సంబంధించిన విషయాల గురించి నంద్యాల జిల్లా ఎస్పీని సంప్రదించి మాట్లాడాలి అనుకున్న ఫిర్యాదుదారులు 9154987020 నంబర్ కు ఫోన్ ద్వారా లేదా మీ యొక్క సమస్యలకు సంబంధించిన ధ్రువపత్రమును వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు, ఈ మేరకు జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. ఆన్లైన్ మోసాలకు సంబంధించి, జాబ్ ఇప్పిస్తామని మోసం చేసిన, బెట్ కాయిన్స్ సంబంధించి గాని, లోన్ యాప్ లలో మోసపోయినా, ఇతర సైబర్ మోసాలకు గురైన వారు మొదటగా 1930 నంబర్ కి గాని www.సైబర్ క్రైమ్. gov.in కు గాని, నంద్యాల జిల్లా సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించి 9154987034 నంబర్ కు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని నంద్యాలజిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి(ఐపీఎస్) తెలిపారు.

వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి

డిసేబుల్డ్ రైట్స్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు మస్తాన్ వలి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా లోని వికలాంగులందరికీ అంత్యో దయ కార్డులు అందించాలని,ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి  ఇవ్వాలని, వికలాంగుల హక్కుల చట్టం 2016 ను ప్రతిష్టంగా అమలు చేయాలని, నంద్యాల నూతన జిల్లాకు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని,అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వికలాంగులకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని, డిసేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సంస్థకు ఐదు సెంట్ల స్థలం, కమ్యూనిటీ హాలు కొరకు స్థలం కేటాయించాలని, పెండింగ్ లో ఉన్నలో ఉన్న 70 మోటరేజ్ బ్యాటరీ ట్రై సైకిల్ లను పంపిణీ చేయాలని మరియు వికలాంగులకు సంబంధించిన సమస్యల పైన డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ (డిఆర్డబ్ల్యుఏ/ఏపి) ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ వికలాంగుల సంక్షేమశాఖ చైర్మన్ కుమారి పటాన్ ముంతాజ్ కు


మరియు వికలాంగుల సహాయ సంచారకులు ఫాతిమాకు వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో సంస్థ సభ్యులు కిరణ్ కుమార్, నబి రసూల్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


 గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో,,

టిప్పర్ గేటు(బండ్ల మెట్ట)వేలం పాట 

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా  ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలం లోని తమ్మరాజుపల్లి గ్రామంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గ్రామ పంచాయతీకి నిధుల కొరతతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పాణ్యం నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎల్పిఓ రామ్ బాబు,పంచాయతీ సెక్రటరీ రాజ శేఖర్,గ్రామ సర్పంచ్ బత్తుల విజయ గౌరీ అధ్యక్షతన గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో టిప్పర్ గేటు(బండ్ల మెట్ట)వేలం పాట నిర్వహించారు.వేలం పాటలో పాల్గొన్న సభ్యులు 20,000/- రూపాయలు డిపాజిట్ చెల్లించి 18 మంది తమ్మరాజుపల్లె గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డిఎల్పిఓ రామ్ బాబు, పంచాయతీ సెక్రటరీ రాజ శేఖర్,గ్రామ సర్పంచ్ బత్తుల విజయ గౌరీ అధ్యక్షతన నిర్వహించిన వేలం పాటలో గ్రామానికి చెందిన మండ్ల మధు 6,65,000-00/-వేలం పాటను దక్కించుకున్నందుకు హర్షిస్తున్నామని,


తమ్మరాజు పల్లె గ్రామ అభివృద్ధి పనులు గ్రామానికి జరుగుతాయని ఆశిస్తూన్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ నాయకులు బత్తుల. శేషారెడ్డి, జగిలి. రామకృష్ణ, షేక్షావలి, బాలరాజు. కోడె. శేషయ్య, విద్యకమిటీ ఛైర్మెన్ మధు సూదన్ నాయుడు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 కరెంటు సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించిన.....

గడివేముల మండల రైతన్నలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా  ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని స్థానిక కరెంటు సబ్స్టేషన్ ను గడివేముల,కొరపోలూరు మరియు సోమాపురం గ్రామాలకు చెందిన రైతన్నలు ముట్టడించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా గడివేముల, కొరపోలూరు,సోమపురం గ్రామాల రైతు సోదరులు మాట్లాడుతూ మా గ్రామాలకు కేవలం రెండు గంటలు మాత్రమే పంటలకు నీరు పెట్టుకునేందుకు విద్యుత్ సరఫరా వస్తుందని,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటలు నిరంతరాయంగా రైతులకు కరెంటు ఇస్తామని చెప్పిన మా గ్రామాలకు గత వారం రోజుల నుండి కేవలం రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుందని,కేవలం రెండు గంటలు సరఫరా చేస్తే మా పంట పొలాలకు నీరును ఏ విధంగా అందించాలో అర్థం కావడం లేదనే ఆవేదనతోనే సబ్ స్టేషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్నామని,


రాష్ట్రప్రభుత్వం చెప్పినట్లుగా తొమ్మిది గంటలు నిరంతరాయంగా మా గ్రామాలకు విద్యుత్ సరఫరాను అందించాలని డిమాండ్ చేశారు.రైతుల నిర్వహించిన ఈ కార్యక్రమానికి గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి రైతు సోదరులకు మద్దతుగా ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతన్నలకు అండగా నిలిచారు.అనంతరం గడివేముల టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను సమయపాలన పాటించకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని,రైతు సోదరులు వేసుకున్న పంటలకు వర్షాలు లేక నీరు అందక పంటలను ఎలా పండించుకోవాలా అని అలమటిస్తున్న తరుణంలో రైతన్నలకు విద్యుత్తును కేవలం రెండు మూడు గంటలు సరఫరా అందించడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలు వేసుకున్న పంటలు పండించుకునేందుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాను కచ్చితంగా రైతు సోదరులకు అందించాలని డిమాండ్ చేశారు.

అనంతరం గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి మరియు రైతు సోదరులు 9 గంటల నిరంతర విద్యుత్ను సరఫరా చేయాలని డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని గడివేముల విద్యుత్ శాఖ ఏఈ గారికి అందించారు.ఈకార్యక్రమంలో గడివేముల, కొరపోలురు,సోమాపురం గ్రామాల రైతు సోదరులు పాల్గొన్నారు.


 ఏపీయూడబ్ల్యూజే రిలే దీక్షలను నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన ....

ప్రముఖ సీనియర్ న్యాయవాది.., తెలుగుదేశం పార్టీ నాయకుడు తాతిరెడ్డి తులసిరెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విలేకరులు జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రముఖ న్యాయవాది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తాతిరెడ్డి తులసి రెడ్డి మాట్లాడుతూ

నంద్యాల జిల్లా మహానంది జర్నలిస్టుపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, నంద్యాల జిల్లాలో విలేకరులపై జరుగుతున్న దాడులపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పి.సి.ఐ) ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ కమిటీకి విలేకరులపై జరుగుతున్న అన్యాయాలపైన వారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు  చేస్తామని తాతిరెడ్డి తులసి రెడ్డి తెలిపారు. నిత్యం ప్రజల కోసం అటు ప్రభుత్వాలకు,ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ వార్తలు సేకరించి సమాజానికి తెలియజేసే విలేకరులపై కేసులు నమోదు చేయడం సర్వసభ్య సమాజానికి సిగ్గుచేటని, జర్నలిస్టులకు రక్షణకు ప్రత్యేక చట్టము రావాలని, విధి నిర్వహణలో దాడులకు గురవుతున్న జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని, ప్రతినిత్యం వాస్తవాలు రాసే జర్నలిస్టులపై భౌతిక దాడులు జరిపి,అక్రమ కేసులు బనాయించడం, కేసులు పెట్టి మానసికంగా వేధించడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు.


విలేకరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతపై ఎపియుడబ్లుజె ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరుగుతున్న రితే నిరాహార దీక్ష చేస్తున్న ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధుబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యాంసుందర్ లాల్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చలంబాబు , ఏపీయుడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఉస్మాన్ భాష, జిల్లా కమిటీ సభ్యులు చల్లా మధు, బాలునాయక్, రాజేష్ కుమార్, నాగమణి, రాణి, వెలుగోడు విశాలాంధ్ర విలేకరి రఘు రాముడు, సూర్య విలేకరి చంద్రశేఖర్ లకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు చేశారు.ఈ కార్యక్రమంలో కాపు సామాజిక నాయకుడు చింతల సుబ్బరాయుడు, మండ్ల గుర్రప్ప, టిటిఆర్ అసోసియేట్ సభ్యులు పాల్గొని జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


 వరుణ దేవుడు కనికరించాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన..... 

కరిమద్దెల గ్రామ ప్రజలు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని కరిమద్దెల గ్రామంలో వర్షాలు పడక తమ పంటలు ఎండిపోతున్నాయని, ఆగస్టు నెల పూర్తి కావస్తున్న పంటలకు సరియైన నీరు అందడంలేదని,వరుణ దేవుడు కనికరించి వర్షాలను కురిపించి తమ పంటలను కాపాడాలని, కప్పలకు వివాహం చేయించి గ్రామ పురవీధుల్లో తిప్పిన అనంతరం గ్రామంలోని శివాలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వరుణ దేవుడు కనికరించి వర్షాలు కురిపించి తమ పంటలను కాపాడాలని కరిమద్దెల గ్రామంలోని ప్రజలు వేడుకున్నారు. ఉత్సవాన్ని నిర్వహించిన గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలందరికీ భోజన సౌకర్యం కల్పించారు.


అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి

బిఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ లింగాల స్వాములు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని పాములపాడు గ్రామంలో విద్యుత్ సరఫరా కోతల వల్ల రైతులు సాగు చేసుకుంటున్న పంటలు ఎండిపోయి రైతన్నతీవ్రంగా నష్టపోతున్నారనీ,విద్యుత్ సరఫరాను అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించి ఆదుకోవాలని బిఎస్పి అసెంబ్లీ ఇంచార్జ్ లింగాలస్వాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాములపాడు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు విద్యుత్ అంతరాయంతో  రైతంగం తీవ్రంగా నష్టపోతున్నారని బిఎస్పీ పార్టీ అసెంబ్లీఇన్చార్జి లింగాల స్వాములు  ఆధ్వర్యంలో రైతులు  ధర్నానిర్వహించారు. ధర్నాకార్యక్రమాన్ని ఉద్దేశించి అసెంబ్లీ ఇన్చార్జి లింగాల స్వాములు మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోతూ రైతులు అల్లాడుతుంటే మరోవైపు రైతులకు అందించే విద్యుత్ కోతలతో ఇబ్బందులకు గురవుతున్న రైతులను ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. పాములపాడు మండల పరిధిలోని వేలాది ఎకరాలు వర్షాధారంపైనే రైతులు పంటలు సాగు చేసుకుంటే మరి కొంతమంది రైతులు బోరుబావి కింద సాగు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని,


ఒకవైపు వర్షాలు సమృద్ధిగా పడకపోవడం వల్ల వర్షా ఆధారంపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు వేసవికాలం లా తలపించే ఎండలతో బోరుబావి క్రింద పంటలు చేసుకున్న రైతులు ప్రతిరోజు నీరు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు.ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటం వల్ల నష్టపోతున్నారని, ప్రభుత్వానికి వీరి బాధలు పట్టవా అని ప్రశ్నిస్తూ, రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసి రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వందలాది రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ప్రసాదం, రైతులు బుడ్డన్న, వెంకటేశ్వర్లు,శివన్న,రమేష్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

 ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా తీసుకెళ్లండి

వైద్యాధికారులను ఆదేశించిన నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక కలెక్టరేట్లో నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్య అధికారులతో,సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామున్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్ అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు18 శాతం నిధులు మాత్రమే వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ నెట్వర్క్ఆస్పత్రులకు దీటుగా వైద్యాధికారులు పనిచేసి కనీసం 50 శాతం ఆరోగ్య శ్రీ నిధులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, రోగులకు సంబంధించిన రోగాలపై మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేవ్యాధులన్నీ ఎన్రోల్ చేయాలన్నారు.రోగులకు ఆరోగ్యశ్రీ ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆమేరకు లక్ష్యాలు సాధించేలా కృషి చేయాలని,పిహెచ్ పరిధిలో ప్రతిరోజు ప్రసవాల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతమంది వెళ్తున్నారు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంతమంది వెళ్తున్నారనే అంశాలపై ఆరా తీసి రోజువారి నివేదికలు పంపించాలని,ఏ కారణం చేత ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందనే అంశాలపై అన్వేషించి నివేదికలు ఇవ్వాలని, ఏఎన్ఎం,ఆశ వర్కర్లను వివరాలు సేకరించేందుకు వినియోగించుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు.


ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలకు ఇబ్బందులు ఎదురైతే సామాజిక ఆరోగ్య కేంద్రాలకు,ఏరియా ఆస్పత్రులకు తరలించాలని,నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడంతో పాటు ఆరోగ్య సిబ్బంది కొరత లేకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుందని,రోగులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు ఆరోగ్య మిత్రలను అనుసంధానకర్తలుగా వ్యవహరించి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ప్రతి పేషంటును ఆరోగ్యశ్రీ కిందికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ను కలెక్టర్ ఆదేశించారు.ఆరోగ్య మిత్రలు,డిఎంహెచ్వో, జిహెచ్ సూపర్డెంట్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, డిసిహెచ్ఎస్ కోఆర్డినేటర్ డా.జఫ్రూళ్ల,జిజిహెచ్ సూపరింటెండెంట్ వరప్రసాద్,ఆరోగ్యశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 సచివాలయ కేంద్రాలలో ఆధార్ క్యాంపులు

గడివేముల ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ గడివేముల మండలంలో 22-08-23వ తేదీ నుండి ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నామని ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప తెలిపారు. గడివేముల గ్రామంలో 22-08-23 వ తేదీన సచివాలయ కేంద్రంలో, 23-08-23 వ తేదీన చిందుకూరు సచివాలయ కేంద్రంలో 24-08-23 వ తేదీన బిలకలగూడూరు సచివాలయ కేంద్రంలో 25-08-23 వ తేదీన మంచాలకట్ట సచివాలయ కేంద్రంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, మండలంలోని గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గడివేముల మండల అభివృద్ధి అధికారి శివమల్లేశ్వరప్ప తెలిపారు.

 కొత్తపల్లి దళితులకు ఇళ్ల స్థలాలు  చూపించకపోతే ఆందోళన ఉదృతంచేస్తాం

సిపిఐ నాయకుల హెచ్చరిక 

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

 నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం లోని కొత్తపల్లి మండల కేంద్రమైన కొత్తపల్లి గ్రామంలో దాదాపు 300 మంది ఇల్లులేని నిరుపేదలకు 2004 సంవత్సరంలో ఇంటి పట్టాలు ఇచ్చారని,పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇంతవరకు అధికారులు స్థలాలు చూపించలేదని, అధికార నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కొత్తపల్లి మండల కార్యదర్శి వెంకట శివుడు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలోని రాజకీయ నాయకులు, దళితులను ఎన్నికల్లో ఇంటి స్థలాల పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప,దళితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు పట్టాలు ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఇళ్ల స్థలాలు చూపించకపోతే జిల్లా స్థాయిలో ఆందోళన ఉదృతంచేస్తామని, కొత్తపల్లి మండల కేంద్రం కావడంతో వివిధ రాజకీయ నాయకులు ఇతరగ్రామాల్లోని వారికి కొత్తపల్లిలో స్థలాలు ఇప్పించడం జరుగుతుందని,స్థానిక దళితులకు మాత్రం స్థలాలు చూపించకుండా అధికారులు, రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని తెలిపారు.


అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్ మాట్లాడుతూ దాదాపు 19 సంవత్సరాలక్రితం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కోటి వరాల పథకం కింద ఇచ్చిన పటాలకు ఇంతవరకు స్థలాలు చూపించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ అధికారి స్పందించి నిరుపేదలైన దళితులకు ఇంటి స్థలాలు చూపించే విధంగా చర్యలు తీసుకోకపోతే ప్రజా పోరాటాల ద్వారా పేద ప్రజలకు ఇంటి స్థలాలు, నిరుపేదలకు భూములు ఇచ్చే వరకు పోరాటాలు చేస్తామని అనంతరం ఆర్డీఓ, ఏవోలు అందుబాటులో అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ తాసిల్దార్ అరుణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు స్వాతి,  మహిళాసమాఖ్య తాలూకా అధ్యక్షురాలు ప్రశాంతకుమారి, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా నాయకురాలు మాణిక్యమ్మ, రాణమ్మ, మూర్తి జాబి, జయ, జయమ్మ, నాగమణి కమలమ్మ, సత్యరాజు, హుస్సేనయ్య, ఏఐటిసి నాయకులు లల్లుహసన్, పుల్లయ్య, మహమ్మద్భాష, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

 ఆర్బికే కేంద్రాల నుండి అన్నిరకాల ఎరువులు రైతన్నల గృహాల వద్దకే

గడివేముల వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని అన్ని ఆర్బికె కేంద్రాల నుండి రైతు సోదరులు 20-20-0-13 స్పీక్ 1130/-, క్రిబ్కో1200/-, సిఐఎల్ 1150/-, యూరియా267/- డిఏపి1350/-, ఎంఓపి (ఐపీఎల్)1669/-,10-26- 26(ఐపీఎల్)1436/-, 10-26-26 క్రిబ్కో1462/-, 28-28- 0 1480/-, 14-35-14 1436/-ధరలలో ఆర్బికే సెంటర్లను అందుబాటులో ఉన్నాయని, రైతన్నలకు ఎరువులు అవసరమైనచో ఆర్బీకే కేంద్రాలలోని సిబ్బందిని సంప్రదించి రైతన్నలకు సంబంధించిన పాస్ పుస్తకము, ఆధార్ కార్డు,రైతు సోదరులు వేలిముద్రలు వేసి ఎరువులను కొనుగోలు చేయవచ్చునని, 200 బస్తాలు కొనుగోలు చేసిన రైతన్నల గృహాల వద్దకే ఎరువులను సరఫరా చేస్తామని గడివేముల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి తెలిపారు.

 జగనన్నకు చెబుదాం-స్పందన విజ్ఞప్తులపైవెంటనే చర్యలు తీసుకోండి

సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా లో ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమంలో స్వీకరించిన విజ్ఞప్తులపై వెంటనే చర్యలు తీసుకోని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ జిల్లాఅధికారులను ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్ వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లాధికారులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీతకాల పరిమితిలోగా నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


పెండింగులో వున్న 132 రీఓపెన్   సర్వీసులకు సంబంధించి  దరఖాస్తులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని,ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా పరిష్కరించాలని, మొక్కుబడి రీతిలో క్లోజ్ చేయకుండా అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో ఖచ్ఛితమైన పరిష్కారం చూపాలని,పెండింగ్ లో ఉన్న జగనన్నకు చెపుదాం ఈకేవైసీని రెండు,మూడు రోజుల్లో పూర్తి చేయాలని, గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరైన 1372 పనుల్లో 705 పనులు పురోగతిలో వున్నాయని మిగిలిన పనులు వెంటనే గ్రౌండ్ లోకి తీసుకరావాలని, గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే త్వరితగతిన పూర్తి చేసి బడి బయట ఉన్న విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 నంద్యాల పట్టణంలోని రెస్టారెంట్లు,హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై తనిఖీలు చేపట్టాలి

అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ (ఏఐఎస్బి)రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని కొన్ని హోటళ్లు,ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్ల యాజమాన్యాలు డబ్బు సంపాధనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారనీ, హోటళ్లు, రెస్టారెంట్లలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజలఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారనీ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ (ఏఐఎఫ్బి) రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ విద్యార్ధి, యువజన సమాఖ్య నంద్యాలజిల్లా అధ్యక్షుడు పెరుగు శివకృష్ణ యాదవ్, ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ (ఏఐఎస్బి) జిల్లా అధ్యక్షుడు తెలుగు మహేష్, ఏఐవైఎల్ ప్రధాన కార్యదర్శి చల్లా సురేష్ బాబులు ఆరోపించారు. నంద్యాలలోని హోటళ్లు, రెస్టారెంట్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను స్ధానిక రెవెన్యూ అధికారులు,ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా పాత్రికేయులతో ప్రజా సంఘాలనేతలు రామినేని రాజునాయుడు,పెరుగు శివకృష్ణ యాదవ్,తెలుగు మహేష్,చల్లా సురేష్ బాబులు మాట్లాడుతూ హోటళ్లలో,రెస్టారెంట్లలో సరైన శుభ్రత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ చికెన్ , మటన్ లాంటి మాంసాహార పదార్ధాల్ని ఫ్రిజ్ లో నిల్వఉంచి వాటిని రెండు, మూడు రోజుల వరకు వండి ప్రజలను మోసం చేస్తున్నారని,


ముఖ్యంగా వంట నూనె కూడా ఒక పదార్ధానికి వాడి అదెే నూనెను రకరకాల పదార్ధాలకు వాడుతూ ప్రజల ఆరోగ్యాలను, ఆయుస్సును తగ్గిస్తున్నారని,కుల్లిపోయిన కూరగాయలను మరియు పాడైపోయిన చికెన్ మసాలాలు నకిలీ కారంపొడి,డాల్డా లాంటి నాసిరకం పదార్ధాలు వాడుతున్నారని వాపోయారు. వంట రూములను కూడా శుభ్రపరచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనీ,నాణ్యత లేని బియ్యం వండుతూ ప్రజలను అనారోగ్యాల పాలుచేస్తున్నారనీ, భోజనాల రేట్లు, మాంసాహారాల రేట్లు అధిక ధరలతో విక్రయిస్తున్నారనీ, నంద్యాల జిల్లా కేంద్రానికి నిత్యం వివిధ గ్రామాల నుండి ప్రజలు వస్తుంటారనీ, ఇటువంటి హోటళ్ల,రెస్టారెంట్ల నిర్వాకం వలన డబ్బు నష్టంతో పాటు ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్నారని, నంద్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు నాసిరకంగా ఉన్నాయని ప్రశ్నించినా , ఆహారపదార్ధాలలలో కీటకాలు పడినా ఇదేంటని అడిగిన కస్టమర్లపై దాడులు చేస్తూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ హోటల్  యాజమాన్యాలు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఇలాంటి హోటల్ లపై తక్షణమే నంద్యాలజిల్లా అధికారులు,ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.

 నందికొట్కూరు మార్కెట్ యార్డ్ నూతన వైస్ చైర్మన్ గా...

మొల్ల షరీఫ్ బాషా బాధ్యతలు స్వీకారం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని స్థానిక మార్కెట్ యార్డ్ నూతన వైస్ చైర్మన్,డైరెక్టర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మున్సిపల్ చైర్మన్,బంగ్లా జడ్పీటీసీ, వైసీపీ నాయకులు హాజరయ్యారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో శాఫ్ చైర్మన్, యువజన విభాగ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని గుర్తించి జనరంజక పాలనలో భాగంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా మొల్ల షరీఫ్ భాషను ఎన్నుకోన్న పెద్దలు నమ్మకాన్ని వమ్ము చేయనని నూతనబాధ్యతలను స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు.మార్కెట్ యార్డ్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లుగా నాని సాత్విక,శివ మల్లమ్మ, మల్లెపూల శిరీష,గురులోళ్ల సరోజమ్మ,కావాటిరాముడు,పోచ కళ్యాణి,సందేపోగు దావీదు,లక్ష్మీ దేవమ్మ, అబ్దుల్ గపూర్,కేతిరెడ్డి ఆది జగదీష్ రెడ్డిలు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన మార్కెట్ వైస్ చైర్మన్ షరీఫ్ భాష మాట్లాడుతూ మార్కెట్ యార్డు నూతన చైర్మన్ గా నావంతు కృషిని తూచాతప్పకుండాపాటించి మార్కెట్ యార్డ్ విధుల పట్ల ప్రతి ఒక్కరికి సహాయ సహకారలను అందించి,  ఎలాంటి లాభపేక్ష లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు.


అనంతరం మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నమ్ముకున్న కార్యకర్తలకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి న్యాయం చేస్తారని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి లక్ష్యమని తెలిపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి బైరెడ్డిసిద్దార్థరెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి  కాకాని గోవర్థనరెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో వైసిపినాయకులు జబ్బార్‌, మాజీ మార్కెట్ యార్ఢ్‌ చైర్మన్‌ తువ్వ శివరామకృష్ణా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి, నందికొట్కూరు ఎంపీపీ మురళిక్రిష్ణారెడ్డి,జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి,80 బన్నూరు సింగిల్ విండో చైర్మన్ వైవీ రమణ, నంద్యాల కర్నూలు జిల్లా వైసీపీ  నాయకులు బిసి సెల్ ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, నందికొట్కూరు మండల కన్వినర్‌ మన్సుర్,మండల వైసిపి నాయకులు మందాడి రవీంద్రరెడ్డి, శ్రీనివాసులు,ఓంకార్‌రెడ్డి, అల్లూరు పాపన్న ,కోకిల రమణా రెడ్డి,జంగంపాడు రాజు,కౌన్సిలర్ లాల్ ప్రసాద్,చట్ట మురళి, జాలంగారి నాగన్న,కాటం రమణ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 ఓర్వకల్లు తాహసిల్దార్ కార్యాలయం వద్ద రైతుల నిరసన దీక్షలు నిర్వహించిన... 

నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా ఓర్వకల్లు మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతుల కోసం నిరసన దీక్ష కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఈసందర్భంగా పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమనీ,వ్యవసాయం పండుగ చేస్తామని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఆత్మహత్యలకు ఫురిగోల్పుతూ రైతుల కన్నీటిని చూస్తూ పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రైతులు గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి గోడును పట్టించుకొనే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని తెలుసుకోవాలని,ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యమేలుతున్న చీకటి పాలన గురించి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని,


చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలలో ప్రాజెక్టుల కోసం 68 వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారని, నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాలలో 22 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని, వ్యవసాయం మీద వీరికి ఏమాత్రం ప్రేమలేదని, అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాలు మనం ప్రతిరోజు పత్రికలలో చూస్తున్నామని,ఓర్వకల్లులో కోట్ల విలువ చేసే భూములను స్థానిక నాయకులు కబ్జాలు చేసుకుంటూ పోతున్న విషయం అందరికి తెలిసినదేనని,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు, ప్రజలకు,యువతకు, బడుగు బలహీన వర్గాల అందరికీ మేలు జరుగుతుందన్నారు.శాసనమండలి సభ్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని,రైతు సమస్యలు పేపర్లలో వచ్చిన కూడా పరిష్కారం చూపే పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదని,ఆయన ఊహల్లో పాలన కొనసాగిస్తున్నాడని,

రైతులు పంట కాలువలకు నీళ్లు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాల మీద నిరసనల ద్వారా సమస్యల గురించి మాట్లాడుకోవడానికి మరియు చెప్పుకోడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఆంక్షలు విధించడం ఎంత వరకు సమంజసం అని ఒకసారి ప్రజల ఆలోచించాలని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను ప్రజలను ఇబ్బంది పాలు చేస్తూ వారి కన్నీటిని చూస్తూ మోసపూరితమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటూ పాలన కొనసాగిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని,వైసిపి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత అతిపెద్ద వివాదం అమరావతి రాజధాని విషయమని, రాజధాని కోసం రాజధాని ప్రాంతంలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారని, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని అమరావతి రాజధాని అయితే అన్ని ప్రాంతాల వారు అభివృద్ధి చెందుతారని మంచి సదుద్దేశంతో వేలఎకరాల భూములు ఇవ్వడం జరిగిందని,సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో జీవోల మీద జీవోలు ఇస్తూ రైతులకు కంటి మీద నిద్ర లేకుండా రైతులపై కేసులు పెట్టించి రైతులను లాఠీలతో,బూటు కాళ్లతో తన్నించుకుంటూ,రైతు కూలీలను,అమరావతి రైతులను జైల్లో పెట్టించి, అరెస్టు చేయించి వారి కన్నీటిని చూస్తు ఆనందపడుతూ రైతులను మోసం చేస్తున్నాడని,చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే రైతు సమస్యలకు పరిష్కార మార్గం,అమరావతి రైతుల త్యాగం వృధా కాదని, రైతులు ధైర్యంగా ఉండాలని ఎవరు కూడా ఆత్మహత్యలకు చేసుకోవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు,మాజీమంత్రివర్యులు శాసనమండలి సభ్యులు ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లెనియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి,శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,ప్రముఖ న్యాయవాది తెలుగుదేశంపార్టీ నాయకుడు తాతిరెడ్డి తులసి రెడ్డి,కాపు సామాజిక వర్గం నాయకులు చింతల సుబ్బరాయుడు,పాణ్యం మండలం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అడ్వైజర్ లాయర్ బాబు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు జయరామిరెడ్డి,ప్రముఖ కాంట్రాక్టర్ చాంద్ బాషా, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు,జడ్పీటీసీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

 నత్తనడక నాడు - నేడు పనులతో...

విద్యార్థులకు తప్పని అవస్థలు

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం స్థానిక నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పథకం కింద మంజూరైన రెండవ దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2022 ఆగస్టులో పనులకు స్వీకారం చుట్టి.2023 జులైలో పూర్తి చేస్తామన్న హామీలు మాత్రం మాటలకే పరిమితమయ్యాయి. నాడు-నేడు పనులు నత్త నడకన కారణం ప్రభుత్వ పథకాలలో నిధులలోపమా..అధికారుల నిర్లక్ష్యమా.. కాంట్రాక్టు మొండి వైఖరా అర్థం కాని స్థితిలో నాడు నేడు పథకం పనులు కొనసాగు తున్నాయి.


ఇందుకు నిదర్శనం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో రాష్ట్రప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల సౌకర్యార్థం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనులు సాగుతున్నాయి. నాడు- నేడు పనులు పూర్తి కాకపోవడానికి కారణం నిధులలోపమా.. అధికారుల నిర్లక్ష్యమా..గుత్తేదారి మొండివైకరా. . అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వర్షం పడితే చాలు ప్రాథమిక పాఠశాల ఆవరణం మొత్తం బురదమయంగా మారుతుంది.నాడు-నేడు పనుల కింద తీసుకువచ్చిన 
మరమ్మతల సామాగ్రితో విద్యార్థులు విశ్రాంతి సమయాలలో ఆటలు ఆడుకొను సమయంలో విద్యార్థులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యాలయాలలో మరమ్మత్తుల పనులు నత్త నడకన సాగుతుండడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం,

ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచి,ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకం ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ లోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మాణవస్తు సామగ్రి,వ్యర్థ పదార్థాలు విచ్చలవిడిగా పడవేయడంతో పాఠశాల విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు.ప్రహరీ గోడ  పునాదుల్లోనే నిలిచిపోయి దర్శనమిస్తుంది. పాఠశాల ఆవరణంమట్టి, నిర్మాణ సామగ్రితో ఉండడం, చినుకు పడితేచాలు పాఠశాల ప్రాంగణమంతా బురదమయంగా మారి పాఠశాల ఆవరణలో అడుగు పెట్టడానికే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల చదువు,క్రీడలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. పాఠశాల గదులన్నీ శిథిలావస్థకు చేరడం తో విద్యార్థులు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాడు- నేడు పనులు కొంతవరకు సాగినా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో రెండు నెలలుగా ఆపేశారు. అర్ధంతరంగా ఆగిన  ప్రాథమిక పాఠశాలలో సిమెంటు బస్తాలు దుమ్ములో, నిర్మాణ సామాగ్రి మధ్యనే విద్యార్థులు విద్యను అభ్యసించడానికి అరచేతిలో పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే నాడు- నేడు పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

 బేతంచర్లలో అన్ని రైళ్లను ఆపాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణం మీదుగా వచ్చి పోయే అన్ని రైళ్లను ఆపాలని సిపిఐ మండల కార్యదర్శి భార్గవ్ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన బేతంచెర్ల పట్టణంలోని సత్రం నుండి పాతబస్టాండ్ మీదుగా రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి రైల్వే సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రాక ముందు బ్రిటిష్ వారు రైల్వేస్టేషన్ ప్రారంభించారని, నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంతంలో ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులు, దినసరి వేతన కూలీలు, విద్యార్థులు ప్రయాణాలు చేసేందుకు అన్ని రకాలుగా ఉపయోగంగా ఉందని, కరోనా వైరస్ కారణం చేత అన్ని రైళ్ళను రద్దుచేసి నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కేవలం ఒకటి రెండు రైలు మాత్రమే పునరుద్ధరించి, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు బేతంచెర్ల మీదుగా తిరుగుతున్నప్పటికీ కనీసం ఒక నిమిషం ఆపకుండా అందరిని ఇబ్బందులకు గురి చేయడం ఏంతవరకు సమంజసమని ప్రశ్నించారు.స్థానిక ప్రజా ప్రతినిధులైన ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో 15 రోజులు, రాష్ట్రంలో 15 రోజులు ఉన్నప్పటికీ సొంత మండలమైన బేతంచర్లలో రైలును ఆపలేకపోవడంతో బేతంచెర్ల ప్రాంత ప్రజలపై ఆయనకు ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థం అవుతుందని, నంద్యాల ఎంపి విత్తనాల వ్యాపారం మీద ఉన్న దృష్టి కనీసం పార్లమెంటు నియోజకవర్గ సమస్యలపై లేదని,ధనార్జన ధ్యేయంగా పాలకులు వ్యాపారస్తులై ప్రజలను బిక్షగాళ్ళుగా మార్చి ప్రజలకు అన్ని సౌకర్యాలను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు నుండి బేతంచర్లకు వచ్చే ప్రయాణికులు బేతంచర్ల కు రావాలంటే అర్థరాత్రి 2 గంటల సమయంలో నంద్యాల లేదా డోన్ బస్టాండ్ లలో దిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజా ప్రతినిధులు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని వాపోయారు.


ఇప్పటికైనా రైల్వే అధికారులు ఆర్థికశాఖ మంత్రి, నంద్యాల ఎంపీ తక్షణమే స్పందించి బేతంచెర్ల మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యంగా అన్ని రైళ్ళను ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించి బేతంచెర్ల మీదుగా వెళ్లే అన్ని రైళ్ళను దిగ్బందిస్తామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు, ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల సహాయకార్యదర్శి దస్తగిరి, తిరుమల, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సూర్య చంద్రుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్, సిపిఐనాయకులు సోమన్న, బాలస్వామి, కాశీమ్, లక్ష్మణ్, మారుతి, పుల్లారెడ్డి, దిలీప్, మధు, ప్రదీప్, మందకృష్ణ, ప్రసాద్, విజయ్ భవన్, వెంకటరమణ, రాజ, వంశీ రమేష్, శివ, రాజేష్, శ్రీను మనోహర్ పాల్గొన్నారు.


 వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం 

పరామర్శించిన....నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకట్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలోని పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త రామాంజనేయులు గత కొన్ని రోజులుగా వైసిపి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు మరియు ఎస్సై బెదిరించి కేసులు పెడతామని మరియు అక్రమ కేసులు పెడుతున్నారని ఒత్తిళ్లు తాళలేక, మనస్థాపానికి గురై రామాంజనేయులు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్న విషయం తెలుసుకొన్న నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మరియు టిడిపి సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రామాంజనేయులును పరామర్శించి,


వైద్య సిబ్బందితో రామాంజనేయులు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని రామాంజనేయులు కు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మరియు టిడిపి సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి వెంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ జయ సూర్య, పగిడ్యాల మండలకన్వీనర్ పలుచాని మహేష్ రెడ్డి తదితరులు పరామర్శించారు.


 నంద్యాల జిల్లాలో రెడ్ క్రాస్ అభివృద్ధికి సహకరిస్తా

జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాహుల్ కుమార్ రెడ్డి గారిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాలజిల్లా బృందము మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు రెడ్ క్రాస్ యాక్టివిటీస్ గురించి వివరంగా అడిగి తెలుసు కొని,ప్రతి విద్యా సంస్థలో జూనియర్ రెడ్ క్రాస్,యూత్ క్రాస్ ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సేవాకార్యక్రమాలలో భాగస్వాములను చేద్దామని,జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సహకరిస్తానని,ప్రతి విద్యా సంస్థలో జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్బులను,


ప్రతి కళాశాలలో యూత్ రెడ్ క్రాస్ క్లబ్బులను ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయడంతో పాటుగా, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గారు రెడ్ క్రాస్ బృందానికి సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల,రెడ్ క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాష,తేలకపల్లి చైతన్య, డిఎఫ్ఓ రాజు నాయక్ పాల్గొన్నారు.

 కంప్యూటర్ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసిన,,,

మహోన్నత వ్యక్తి   రాజీవ్ గాంధీ

నంద్యాల కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు కాలేజీ హాస్టల్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళులర్పించిన లక్ష్మీ నరసింహ యాదవ్, కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆగస్టు 20 1944 జన్మించారని, అతి పిన్ని వయసులో 1984-1989 మధ్య కాలం లో ప్రధానిగా చేసిన ఘనత  రాజీవగాంధీని, రాజీవగాంధీ పూర్తి పేరు రాజీవ్ రత్న గాంధీఅని,ప్రజలకోసం  ఆలోచించి అనేక అభివృద్ధి  పధకాలను  ప్రవేశపెట్టిన ఘనత రాజీవగాంధీ గారిదని,రాజీవగాంధీ ప్రధానిగా ఉన్న సమయం లో అనేక విప్లవత్మాక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించిన మహనీయుడని,


రాజీవగాంధీ 1966 లో యూకే లో విద్యాబ్యాసం పూర్తి చేసుకుని ఇండియాలో వచ్చి  పైలట్ గా ఉద్యోగ బాధ్యతలను చేపట్టారని,తల్లి ఇందిరా గాంధీ బలవంతంవల్ల  దేశ రాజకీయాల్లోకి రావడం  జరిగిందని,సంజయ్ గాంధీ  ప్రాతినిధ్యం వహించిన అమేధీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొంది పార్లమెంట్ లో అడుగు పెట్టారని,1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీ  దారుణహత్య తరువాత రాజీవగాంధీ  ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని,1984 డిసెంబర్ లో జరిగిన  ఎన్నికలలో 411 స్థానాలు  సాధించిన అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీని.

రాజీవగాంధీ ప్రధాని అయిన తర్వాత దేశంలో టేలీకమ్యూనికేషన్స్ లో విప్లవత్మక  మార్పులు తెచ్చారని,సైన్స్ మరియు టెక్నాలజీ,ఐటీరంగం ఎంతో అభివృద్ధి  చెందిందని, గ్రామీణభివృద్ధి, కంప్యూటర్ రంగాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని సంకేతంగా ముందుకు తీసుకువెళ్లిన మహనీయుడని, పారిశ్రామిక రంగంలో  పన్ను తగ్గింపు విధానాన్ని అవాలంభించి,రక్షణ,విమానయన,వాణిద్య రంగాలు అభివృద్ధి చెందాయని, ఆధునిక ఆర్థిక విధానం వలన విదేశిపెట్టుబడులను  ఆకర్షించి పెట్టుబడులకు భారత్ ని స్వర్గధామం చేశాడని,1986 లో న్యూ నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టి బడుగు,బలహీనవర్గాల  అభ్యున్నతకి ఎంతగానో తొడపడిందని,నవోదయ పాఠశాలలు స్థాపించి విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చారని,1987 లో బ్లాక్ బోర్డు ఆపరేషన్,1985 లో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ,నవోదయ స్కూల్స్ వీటి వల్ల  గ్రామీణ  లో ఉన్న వారు  విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత కేవలం రాజీవ్ గాంధీకి మాత్రమే దక్కుతుందని, అలాంటి మహనీయుని కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసి ఆ సంతోషాన్ని రాజీవగాంధీకి అంకితం చేయాలని లక్ష్మీ నరసింహయాదవ్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు పఠాన్ హాబిబ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు సాంబశివుడు,రహీం,అబ్రహం,నంద్యాల పార్లమెంట్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు నాగలింగం,అమర్,రమణ, శ్రీనివాసులు,దస్తగిరి,కల్లూరు మండలం అద్యక్షులు, కల్లూరు మండల యస్సిసెల్ అధ్యక్షుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.