తెలంగాణ పోరాట తెగువను ప్రపంచానికి తెలియజేసిన ...
యోధుడు దొడ్డి కొమరయ్య
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరులు దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సందర్భంగా కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులర్పించారు. ఖైరతాబాద్ లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో దొడ్డి కొమురయ్యర చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
భూమికోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప పోరాట తొలి అమరులు దొడ్డి కొమురయ్య గారు నిలిచారని,వర్ధంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, జడ్పీటీసీలు, ఎంపీపీలు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Home
Unlabelled
తెలంగాణ పోరాట తెగువను ప్రపంచానికి తెలియజేసిన ... యోధుడు దొడ్డి కొమరయ్య మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: