జగన్ తో తెలంగాణ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. ఏపీ సీఎంతో పొంగులేటి భేటీ ఆసక్తికరంగా మారింది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. మరోవైపు ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: