జూపాడుబంగ్లా ప్రభుత్వ వైన్ షాప్ లో చోరీ

 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలో ప్రభుత్వ వైన్ షాప్ లో 10.05.2023 వ తేది రాత్రి  గుర్తు తెలియని వ్యక్తులు  రేకులను కట్టర్ తో కట్ చేసి లోపలికి వెళ్లి క్యాష్ బాక్స్ నందు ఉన్న నగదు రూ 3,07,340/ దొంగలించుకొని పోయారని వైన్ షాప్ సుపర్వైజర్ తెలుగు పరమేష్ జూపాడుబంగ్లా పోలీస్ లకు సమాచారం తెలుపడంతో జూపాడుబంగ్లా పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఐపీఎస్  ఆదేశాల మేరకు విచారణలో భాగంగా ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు  పర్యవేక్షణలో నందికొట్కూరు రూరల్ సిఐ సుధాకర్ రెడ్డి తన సహచర పోలీస్ సిబ్బందితో వివిధ కోణాలలో దర్యాప్తు ప్రారంభించి అందుకున్న విశ్వసనీయమైన  సమాచారం మేరకు  జూపాడుబంగ్లా గ్రామ శివారులోని కేజీ రోడ్డులో కేసీ కెనాల్ దగ్గర పోలీస్  సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించి స్కూటి మీద వస్తున్న పల్నాడు జిల్లా కారంపూడి గ్రామానికి చెందిన బొట్ట మణికంఠ రెడ్డి (28),పూల మణికుమార్(29) లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి  2,10,00/- నగదును,ఒక స్కూటి, యాక్సెస్ బ్లేడ్,కట్టర్ లను స్వాధీన పలుచుకున్నామని నందికొట్కూరు రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: