ఢీకొట్టి, ఇనుప రాడ్డులతో బాది..ఉపాధ్యాయుడు దారుణ హత్య

ఢీకొట్టి, ఇనుప రాడ్డులతో బాది..ఉపాధ్యాయుడు దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య ఘటన విజయనగరం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణంగా హత్యకు గురైన సంఘటన విజయనగరం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఏగిరెడ్డి కృష్ణమూర్తి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హతమార్చారు. ద్విచక్రవాహనంపై పాఠశాల నుంచి వస్తుండగా కారుతో ఢీకొట్టారు. 100 మీటర్ల మేర బైక్‌ను ఈడ్చుకెళ్లి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా.. కొన ఊపిరితో ఉన్న కృష్ణమూర్తిని ఇనుప రాడ్లతో కొట్టి చంపేశారు.

అదే దారిలో ఆటో డ్రైవర్‌ రావడంతో సంఘటనా స్థలి నుంచి నిందితులు పరారయ్యారు. రాజాం మండలం ఒమ్మి- కొత్తపేట కూడలి మధ్య ఈ సంఘటన జరిగింది. కృష్ణమూర్తి హత్యతో ఉద్ధవోలు గ్రామస్థులు, తెర్లాం మండలం కాలంరాజుపేట పాఠశాల విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిందితులను అప్పగించాలంటూ ఉద్ధవోలు గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రెండు గంటల సేపు రహదారిని దిగ్బంధించారు. బొబ్బిలి, చీపురుపల్లి డీఎస్పీల హామీతో ఆందోళన విరమించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో రాజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, ఉద్ధవోలు రాజకీయాల్లో కృష్ణమూర్తి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి వెంకటనాయుడితో మృతుడు కృష్ణమూర్తికి రాజకీయ వైరం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కృష్ణమూర్తి మద్దతు ఇచ్చిన మహిళ చేతిలో వెంకటనాయుడు ఓడిపోయారు. దీంతో ఓటమి తర్వాత కృష్ణమూర్తిపై మరింత కక్ష పెంచుకున్నాడు. దీనికి తోడు వెంకటనాయుడు కట్టిన అక్రమ నిర్మాణంపై కృష్ణమూర్తి మద్దతుదారులు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు కూడా వ్యతిరేకంగా రావడంతో వెంకటనాయుడు పగతో మరింత రగిలిపోయాడు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తిని చంపేందుకు వెంకటనాయుడు కుటుంబం కుట్ర పన్నిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పక్కా ప్రణాళికతోనే కృష్ణమూర్తిని శనివారం హతమార్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: