డాక్టర్ వైయస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ మరియు పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను,,,

ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి మరియు రైతు దినోత్సవ వేడుకల్లో భాగంగా పాణ్యం పట్టణంలో వ్యవసాయ శాఖ నంద్యాల సబ్ డివిజన్ వారి ఆధ్వర్యంలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన డాక్టర్ వైయస్సార్ అగ్రి టెస్టింగ్ మరియు పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ సభ్యులు మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ డాక్టర్ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం ఖరీఫ్ 2022 కింద పాణ్యం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించి 16,465 మంది రైతులకు 19 కోట్ల 76 లక్షల రూపాయలు నిధులు జమ అయ్యాయని,


రైతు సోదరులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విత్తనాలు,పురుగుమందులు,ఎరువులు సరఫరా, రైతు భరోసా కేంద్రాల యందు నాణ్యమైన కారకాలను రైతన్నలకు అందజేసి,ఖర్చులను ప్రతి రైతన్నకు తగ్గించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకువచ్చారని,  ఈ ప్రయోగశాలలో చట్ట, ఆర్బికే,రైతు,వ్యాపారుల నమూనాలను పరీక్షలు నిర్వహించబడతాయని, ప్రయోగశాలలో కల్తీ కారకాలను అరికట్టి పంటల నాణ్యత ప్రమాణాలు పెంచ వచ్చని,

పరీక్ష చేసిన కారకాలను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేసి పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెంచి,ఖర్చు తగ్గించుటకు రైతన్నలలో అవగాహన కల్పించి 
రైతన్నకు నికర ఆదాయం పెంచుటకు ఈ ప్రయోగశాలలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎంపీపీ హుస్సేన్ బి, మాజీజెడ్పిటిసి సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్ పల్లవి, ఎమ్మార్వో మల్లికార్జున్రెడ్డి, ఎంపీడీవో దస్తగిరి, ఎంపీటీసీలు, రైతు సోదరులు, వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: