ఒక ప్రత్యేక విజన్ తో మీర్ పేట్ కార్పొరేషన్ సమగ్రాభివృద్ధి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ  డివిజన్ జిల్లెలగూడలో ఒక కోటి 59 లక్షల రూపాయలతో సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేయడంతోపాటు వాటి పనులను ప్రారంభించారు.  45వ  డివిజన్ లో 50 లక్షల రూపాయలతో  చేపట్టే సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిమాట్లాడుతూ...


మిథుల నగర్,  లక్ష్మీ నరసింహ కాలనీ,  ఎమ్ ఎల్ ఆర్ కాలనీ మీదుగా కట్టిన ట్రంక్ లైన్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల వరద నీటి కష్టాలు తీర్చినట్లు తెలిపారు. 
కార్పొరేషన్లలోని గొలుసుకట్టు చెరువుల మధ్య నీరు సాఫీగా వెళ్లేలా  పెద్ద చెరువు, మంత్రాలు చెరువు, చందనం చెరువుల గుండా ట్రంక్ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ లో నాళాల అభివృద్ధికి మిథుల నగర్ సమస్య పరిష్కారం ఒక మార్గం చూపిందన్నారు.

మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు  వరద కొనసాగుతుందన్నారు. తాజాగా మీర్ పేట్ కార్పొరేషన్ కు 50 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు,  మంత్రి కేటీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  ఇప్పటికే కొనసాగుతున్న 25 కోట్ల నిధులతో పాటు,  తాజాగా వచ్చిన 50 కోట్లు కలిపి 75 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా  చేపట్టనున్నట్లు తెలిపారు.  ఒక ప్రత్యేక విజన్ తో కార్పొరేషన్ సమగ్రాభివృద్ధి చేస్తున్నట్లు ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతాం అన్నారు. 
పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృతా మార్కెట్, వైకుంఠ దామాల నిర్మాణం.  స్వచ్ఛతకు చిరునామాలుగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు.

1200 కోట్లతో నాళాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అందులో, 110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు, ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామని. గుర్రం గూడ, కూర్మల్ గూడ, జిల్లెల గూడ, బడంగ్ పేట్ ల వద్ద రిజర్వాయర్లు పనులు జరుగుతున్నాయన్నారు. 


నియోజకవర్గంలో బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లిల పరిధిలోని 10 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. బడంగ్ పేట్,మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 9 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఊహాలకందని అభివృద్ధి జరిగిందని, మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాలు, 24 గంటల విద్యుత్ లాంటి మైలు రాళ్లు అందుకుందన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలోతో భారీగా పెట్టుబడులు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.

ఈ కార్యక్రమాలాలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్,  డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి,  పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి,  వర్కింగ్ ప్రెసిడెంట్ భుపేష్, 45 వ డివిజన్ కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్,  పలు డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: