దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం,,,ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

 దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం,,,ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు


ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కటికంవారిపల్లె గ్రామానికి చెందిన 20 మంది మదనపల్లె సమీపంలోని బోయకొండ గంగమ్మ తల్లి దర్శించుకునేందుకు ఆదివారం ఉదయం బయల్దేరారు. టాటా ఏస్‌, టాటా సుమో రెండు వాహనాల్లో 10 మంది చొప్పున గంగమ్మ తల్లి దర్శనానికి బయల్దేరారు.
చిన్నిఒరంపాడు సమీపంలోకి రాగానే.. జాతీయ రహదారిపై అదుపుతప్పిన టాటా ఏస్‌ వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనం డ్రైవర్ నర్సింలు (57) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా శంకరమ్మ (60) అనే మహిళ మార్గమధ్యలో చనిపోయింది. మిగిలిన ఐదుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, దైవదర్శనం కోసం వెళ్తూ.. ఇలా మృత్యుఒడికి చేరుకోవటంతో కటికంవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నంద్యాల జిల్లా రాయమల్పురం గ్రామ సమీపంలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో మల్లిఖార్జున అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: