నాచారంలో అతిగా మద్యంసేవించి వ్యక్తి మృతి,,,వైన్ షాప్ ఎదుట బంధువుల ఆందోళన


తన భర్త చావుకు కారణమయ్యారంటూ హైదరాబాద్ నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైన్‌షాప్‌పై దాడి చేసింది. షాప్‌లోని మద్యం బాటిళ్లను ధ్వంసం చేసింది. ఆగ్రహంతో ఊగిపోతూ.. వాటిని పగులగొట్టింది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతానికి చెందిన నాగి అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ వైన్ షాప్‌కు వెళ్లి సోమవారం రాత్రి మద్యం తాగాడు. అతడు ఓవర్‌గా డ్రింక్ చేయటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో వైన్ షాప్ నిర్వహకులు.. అతడిని వైన్స్ బయట పడుకోబెట్టారు.

అపస్మారక స్థితిలోకి వెళ్లిన నాగి కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు వైన్ షాప్ వద్దకు భారీగా చేరుకున్నారు. మద్యం దుకాణం ముందు ఆందోళనకు దిగారు. అతడి మృతితో తమకు సంబంధం లేదని వైన్ షాప్ నిర్వహకులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి భార్య షాప్‌లోపలికి వెళ్లి మధ్యం బాటిళ్లను ధ్వసం చేశారు. చేతికందిన బాటిళ్లను నేలకొసి కొట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. నాగి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరిలించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: