ధనార్జినే ధ్యేయంగా ప్రైవేటు పాఠశాలు
నిద్రా వస్థలో విద్యాశాఖ అధికారులు
చర్యలు తీసుకోవాలని ఐసా, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల సెయింట్ పాల్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నియమ, నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా ధనార్జనే ధ్యేయంగా పేద విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న సెయింట్ ఫౌల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలు తీసుకోవాలని, ఎస్ఎఫ్ఐ,ఐసా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ పాల్ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.అనంతరం ఐసా జిల్లా కార్యదర్శి యస్.నాగార్జున,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డక్క కుమార్ లు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక జీవోలను అమలు చేస్తుంటే అందుకు విరుద్ధంగా నిబంధనలను తుంగలో తొక్కి పుస్తకాలు, యూనిఫామ్ ల పేరుతో పేద విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని కాసుల పంటను పండించుకొని, విద్యను వ్యాపారంగా మార్చుకున్నారని,ప్రభుత్వ నియమ,నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా ధనార్జన, దేయంగా పేద విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న సెయింట్ ఫౌల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ప్రభుత్వ నిర్ణయించిన ధరలకంటే ఎక్కువ అమ్ముతూ ప్రైవేట్ మెటీరియల్స్,ప్రవేట్ నోట్ బుక్స్ పాఠశాల ఆవరణంలో ఎక్కువ మొత్తంలో ఉంచుకొని,
యూనిఫామ్,టై,బెల్టు, అక్కడే కొనాలని ఆదేశాలు జారీ చేస్తు విద్యను వ్యాపారం చేస్తూ విద్యాలయాలను కిరాణా దుకాణంలా మారుస్తు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ఎక్కువ ధరకు అమ్ముతూ అక్రమంగా వసూలు చేస్తున్న ఘనత సెయింట్ ఫౌల్ పాఠశాల యాజమాన్యానికే చెల్లిందని,ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి సెయింట్ ఫౌల్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని విద్యాశాఖ అధికారులను ఐసా జిల్లా కార్యదర్శి యస్.నాగార్జున,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డక్కా కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్,రాజు, అభి ఐసా నాయకులు దావీదు,సంతోష్,సూర్య, కిరణ్ మరియు ఐస, ఎస్ఎఫ్ఐ విద్యార్థినాయకులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ధనార్జినే ధ్యేయంగా ప్రైవేటు పాఠశాలు... నిద్రా వస్థలో విద్యాశాఖ అధికారులు.... చర్యలు తీసుకోవాలని ఐసా, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: