ఆస్తులమ్మి రాజకీయాలు చేశా.... వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తున్నా,,ఎమ్మెల్యే అన్నా రాంబాబు

 ఆస్తులమ్మి రాజకీయాలు చేశా.... వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తున్నా


వచ్చే ఎన్నికలో పోటీ చేయడం అవసరమా..అని ఆలోచించుకోవాల్సి వస్తోందన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. తన మనసు రాజకీయాలు మానుకోవాలని చెబుతోందన్నారు. కంభంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు అందిన ప్రయోజనాలను వివరించారు. అనంతరం జరిగినసభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

తానువచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా అనే సంఘర్షణలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. తనను, తన కుటుంబ సభ్యులను విమర్శిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ కులానికి.. ఏ మతానికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. రెడ్డి కులానికి ద్రోహం చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. తనపై, తన కుటుంబంపై, కులంపై మాట్లాడిన ముగ్గురు, నలుగురి గురించి గతంలో బేస్తవారపేటలో మాట్లాడాను అన్నారు.

తాను ఎలాంటి తప్పూ చేయకపోయినా.. గత నాలుగేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను అన్నారు. తాను అనవసరంగా మాటలు అనిపించుకోవాల్సి వస్తోందని భావోద్వేగానికి గురయ్యారు. తాను ఇప్పటి వరకూ ఆస్తులు అమ్మి రాజకీయం చేస్తున్నాను అన్నారు రాంబాబు. కొందరు పార్టీకి నష్టం చేస్తున్నారని.. అలాంటి పనులు మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కొంతకాలంగా గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో విభేదాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేపై కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అలాగే రాంబాబు కూడా గతంలో టీటీడీలో పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: