భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలన్నదే కేసీఆర్ కల

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జల్ పల్లి మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి


 (జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మునిసిపాలిటీ అభివృద్ధికి బాటలు వేస్తూ ఒకే రోజు పది కోట్ల రూ. 40 లక్షలతో  చేపట్టబోయే పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు 5 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన లు,  తాగునీటి అవసరాలు తీర్చే నిమిత్తం 5 కోట్ల పై చిలుకు నిధులతో నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. వార్డు నెంబర్ 1 లో 80 లక్షలతో,వార్డు నెంబర్ 26 లో 80 లక్షలతో,వార్డు నెంబర్ 27 లో 80 లక్షలతో,వార్డు నెంబర్ 25 మరో 80 లక్షలతో,వార్డు నెంబర్ 28 లో 80 లక్షలతో,వార్డు నెంబర్ 6 లో 80 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు.


ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...పట్టణ ప్రగతి లో భాగంగా  సమీకృతా మార్కెట్ పనులు త్వరలో ప్రారంభిస్తామని, వైకుంఠ దామాల నిర్మాణం జరుగుతుందన్నారు. తాజాగా 25 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. జల్ పల్లి మునిసిపాలిటీ లో అంతకుముందు 56 పనులకు 22 కోట్ల 40 లక్షలు, నిధులు మంజూరు అయ్యాయని వీటితో సీసీ, బీటీ రోడ్లతో పాటు పలు చోట్ల రోడ్ల వెడల్పు పనులు  మొత్తం 132 పనులకు గాను 43.585 కోట్ల వ్యయంతో నియోజకవర్గ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు.  100 కోట్లతో జల్ పల్లి మునిసిపాలిటీ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.


1200 కోట్లతో నాళాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అందులో,110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 210 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు,ట్యాంకులు, రిజర్వాయర్లు కడుతున్నామని.గుర్రం గూడ, కూర్మల్ గూడ, జిల్లెల గూడ, బడంగ్ పేట్ ల వద్ద రిజర్వాయర్లు పనులు జరుగుతున్నాయన్నారు. మిషన్ భగీరథ  ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరిందన్నారు. నియోజకవర్గంలో బడంగ్ పేట్,  మీర్ పేట్, జల్ పల్లి ల పరిధిలోని 10 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.  బడంగ్ పేట్,మీర్ పేట్,జల్ పల్లి, తుక్కుగూడ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


గృహ లక్ష్మి పథకం కింద స్వంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవటానికి 3 లక్షలు ఇవ్వనున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. నోటరీ ఇళ్లకు క్రమబద్ధీకరణ అవకాశం ఉందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.  పహాడి షరీఫ్ పాఠాశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.  మిగిలిన దర్గా ర్యాంప్ రోడ్డు పనులకు ఇటీవలే 5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 9 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఊహాలకందని అభివృద్ధి జరిగిందని,24 గంటల విద్యుత్ లాంటి మైలు రాళ్లు అందుకుందన్నారు. 


75 వేల కోట్లు రైతన్నల ఖాతాలో వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమలోతో భారీగా పెట్టుబడులు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. షాది ముబారక్ తో పేదింటి అడబిడ్డల వివాహాలకు అండగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరుపున విందు ఏర్పాటు చేసి,  పేదలకు రంజాన్ తోఫా అందిస్తున్నారని అన్నారు.  అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లాగా ముందుకు వెళ్తున్నామన్నారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: