తల్లితో సహజీవనం చేస్తూ...ఆమె కూతుళ్లపై కన్నేశాడు
ఓ మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. ఆమె కుమార్తెపైనా కన్నేశాడు. కూతురు వరసయ్యే యువతిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేసి ఆ ప్రబుద్ధుడిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ దాసారంబస్తీకి చెందిన ఓ మహిళ(50)ను భర్త వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆమెకు కుమార్తె(19), కుమారుడు ఉన్నారు. చిన్నతనంలోనే తండ్రి వారిని వదలివెళ్లిపోగా.. కష్టపడి వారిని పెంచి పెద్ద చేసింది. ఆమెకు అనారోగ్యానికి గురి కావటంతో కుమార్తె ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట ఆ యువతి తన తల్లిని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ ఆసుపత్రిలో పనిచేసే నాగరాజు(57) అనే వ్యక్తి వారికి పరిచయమయ్యాడు.
వారికి సాయం చేసినట్లు నటించాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి ఇంటి వద్ద దిగబెట్టాడు. తన భార్య తనను వదిలిపెట్టి వెళ్లిందని.. తాను ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో తల్లి ఇంట్లో లేని సమయంలో నాగరాజు ఆమె కుమార్తెను వేధించడం ప్రారంభించాడు. తన కోరిక తీర్చాలని యువతిని ఇబ్బందిపెడుతున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేని యువతి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లి యువతితో కలిసి ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తల్లితో సహజీవనం చేస్తూ...ఆమె కూతుళ్లపై కన్నేశాడు
Post A Comment:
0 comments: