షాది తొఫాలో దూదేకుల ముస్లింలకు న్యాయం చేయాలి

నంద్యాలజిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన...దూదేకుల సంఘం నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ నందు జరిగిన స్పందన కార్యక్రమంలో షాది తోఫాలో దూదేకుల ముస్లింలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ కు, జిల్లా మైనారిటీ అధికారినికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చినప్పటి నుండి దూదేకుల ముస్లింలకు షాదితోఫా,దుల్హన్ పథకం లాంటి మైనార్టీ పథకాలలో ముస్లింలతో సమానంగా దూదేకుల కుటుంబాలకు లబ్ధిచేకూరేదని ఇటీవల ప్రభుత్వము విడుదల చేసిన షాది తోఫాలో ముస్లింలకు లక్ష రూపాయలు,



దూదేకుల కుటుంబాలకు 50 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని,నిరుపేదలైన దూదేకుల కుటుంబాలకు తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారని,ముస్లిం మైనార్టీలు లబ్ధి పొందే పథకాలలో ముస్లింలతో సమానంగా దూదేకుల కుటుంబాలకు పారితోషకం వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని నంద్యాల దూదేకుల సంఘం అధ్యక్షుడు వాసవిదస్తగిరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామున్ మరియు మైనార్టీ జిల్లా అధికారిని గారికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ దూదేకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆదాం సాహెబ్,కోశాధికారి సోమశేఖర్,సంఘం నాయకులు హుస్సేన్,గబ్బర్,దస్తగిరి, పోస్టల్ హసన్ బాషా,సీడ్స్ బాబు,నాగరాజు,దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: