చార్ మహల్ రజక సంఘం ఆధ్వర్యంలో,,

ఘనంగా బోనాల ఉత్సవాలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

చార్ మహల్ రజక సంఘం ఆధ్వర్యంలో సిటీ కాలేజ్ సమీపంలోని తాటి మైసమ్మ దేవాలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గిల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రజక సంఘం చైర్మన్ కృష్ణమూర్తి గ్రేటర్ హైదరాబాద్ రజక సంఘం చైర్మన్ నర్సింగ్ రావుల పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 



ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో చార్మహల్ రజక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ ఉపాధ్యక్షులు దామర నర్సింగరావు ప్రధాన కార్యదర్శి షాపురం రవి కోశాధికారి బాలరాజ్ లతూపాటు రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: