పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
సిపిఐ నాయకుల డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో నడిబొడ్డున ఉన్న పద్మా నగర్ సొసైటీ లో జరుగుతున్న అవకతకతల ఆరోపణల పై సొసైటీని రద్దుచేసి జిల్లా అధికారులతో తిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని,పేదల ఆధీనంలో ఉన్న సర్వే నెంబర్ 703 లోని ప్రభుత్వ భూమిలో అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధర్యంలో పద్మావతి నగర్ భూములను పరిశీలిస్తూ ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫక్రుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురాంమూర్తి, పట్టణ కార్యదర్శి ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయుడు, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బరాయుడు, నాయకులు హుస్సేన్ భాష, మాభాష పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ నంద్యాల జిల్లా అనంతరం ప్రైవేటు స్థలాలకు భూముల విలువ పెరిగిందని,ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ అధికార పార్టీ నాయకులు భూకబ్జాలు చేస్తున్నారని,అందులో భాగంగా 22 సంవత్సరాల కిందట ఏర్పడిన పద్మావతి నగర్ లో సొసైటీ కేవలం 8 మంది కమిటీ సభ్యలు1456 మంది సభ్యులతో కమిటీ ఏర్పడిందని,కానీ ఏనాడు కమిటీసభ్యుల సమావేశం నిర్వహించకుండా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలుగా జరుపుకున్నట్లు చేసుకొని కమిటీ సభ్యులు ఒకరికి తెలియకుండా ఇంకొకరికి రిజిస్టర్ చేసుకోవడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు.
పద్మావతి నగర్ ప్రధాన కాలువ కేసీ కెనాల్ పంట కాలువను కేసీ కెనాల్ అధికారుల అవినీతి వల్ల వాటిని మూసివేసి పెద్దపెద్ద భవనాలు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని,2003 వ సంవత్సరంలో సిపిఐ ఆధ్వర్యంలో భూస్వాములు ఆక్రమించిన సర్వేనెంబర్ 703 ప్రభుత్వ భూమిలో నిరుపేదలు భూ పోరాటాలు నిర్వహించి గుడిసెలు వేసుకుంటే అప్పటి కేసీ కెనాల్ అధికారులు వాటిని తొలగించి సర్వేనెంబర్ 703 లో ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు పక్కా పట్టా ఇచ్చారని పట్టాలు తీసుకున్నవారు తిరిగి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.నంద్యాల పట్టణంలో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్న పోలీసు అధికారులు కానీ రెవిన్యూ అధికారు లు గాని నిమ్మకు నీరత్తినట్లు వివరిస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి అనేక ఆరోపణలతో సొంత అన్నదమ్ముల ఆరోపణలతో నిండిన పద్మావతి సొసైటీని రద్దుచేసి జిల్లా అధికారులతో త్రిసభ్య కమిటీ 1456 మంది సభ్యులతో సమావేశం ఏర్పాటుచేసి నిజమైన లబ్ధిదారులకు పద్మావతి నగర్ భూములను పంచి ఇవ్వాలని పేదల ఆధీనంలో ఉన్న సర్వేనెంబర్ 703 లోని ప్రభుత్వ భూమిలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని లేనిపక్షంలో సిపిఐ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం. కేసీ కెనాల్ కార్యాలయం. ఎదుట రిలేనిరాహార దీక్షలు తోపాటు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని నాయకులు హెచ్చరించారు.
పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి...
సిపిఐ నాయకుల డిమాండ్
Post A Comment:
0 comments: