మా తెలంగాణ పార్టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం


అనవసర పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారంటూ 'మా తెలంగాణ' పార్టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టులో తప్పుడు పిటిషన్ దాఖలు చేసినందుకు మా తెలంగాణ పార్టీకి రూ.50వేల జరిమానా విధించింది. హైకోర్టు జరిమానాపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు విధించిన జరిమానాను మాఫీ చేయాలని కోరుతూ భారత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.


తమ క్లయింట్ ది పేద పార్టీ అని, హైకోర్టు విధించిన జరిమానాను కట్టలేమని మా తెలంగాణ పార్టీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీది రిజిస్టర్డ్ పార్టీ కదా అని జస్టిస్ పీఎస్ నరసింహ అన్నారు. ఇష్టానుసారంగా పిటిషన్‌లు వేస్తూ పేద పార్టీ అంటారా? అని ప్రశ్నించింది. పేద పార్టీ అంటూ తప్పుదారిపట్టించినందుకు పెనాల్టీ కట్టాలని ధర్మాసనం... మా తెలంగాణ పార్టీని ఆదేశించింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: