భార్య డెడ్‌బాడీని తీసుకొస్తుండగా ప్రమాదంలో భర్త మృతి,,,అనాథలైన ఇద్దరు పిల్లలు

 భార్య డెడ్‌బాడీని తీసుకొస్తుండగా ప్రమాదంలో భర్త మృతి,,,అనాథలైన ఇద్దరు పిల్లలు


విధి ఎంత కఠినమైందో.. పీకల్లోతు బాధల్లో ఉన్నవాడికే మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది. ఇక్కడో కుటుంబానికి మాత్రం తీరని శోకం మిగిల్చింది. భార్య చనిపోయిందన్న కొండంత బాధను గుండెల్లో పెట్టుకుని డెడ్‌బాడీని ఆస్పత్రి నుంచి ఇండికి తీసుకెళ్తుండగా.. లారీ రూపంలో మృత్యువు ఆ భర్తను కబళించింది. మంచిర్యాల జిల్లాలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుంది. లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మల్లికార్జున్‌ రావు (31), శరణ్య (29) భార్యాభర్తలు. తమ పొరుగింటి వారితో గొడవ జరగ్గా.. మనస్తాపం చెందిన శరణ్య ఈనెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ శరణ్య శనివారం రోజు మృతి చెందింది.

భార్య చనిపోయిందన్న బాధలో ఉన్న మల్లికార్జున్.. శరణ్య మృతదేహాన్ని ఆదివారం రోజున అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్నాడు. తాను కూడా అంబులెన్స్ వెంటే బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే.. లక్షెట్టిపేటలోని కరీంనగర్‌ చౌరస్తా వద్ద మల్లికార్జున్‌ రావు బైక్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మల్లికార్జున్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

ఒక్క రోజు గ్యాప్‌లోనే దంపతులిద్దరూ మృతి చెందటంతో.. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవటంతో.. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: