జగనన్న సురక్షలో ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యం

నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం స్థానిక నందికొట్కూరు పట్టణంలో మున్సిపల్ కమీషనర్  కిషోర్,మేనేజర్  మంజునాథ గౌడ్ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సచివాలయ జె.సి.యస్ కన్వీనర్ అబూబక్కర్, కౌన్సిలర్లు అబ్దుల్ హమీద్ మియ్య,రాధిక,లాలు ప్రసాద్, శాలి భాష పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణ ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కుల, ఆదాయ, జనన,వివాహ, మరణ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతన్నలకు మ్యూటేషన్, పంటసాగు అనుసంధానం, ఆధార్ కు ఫోన్ నెంబర్, రేషన్ కార్డు మార్పులు, గృహ సంబంధిత మార్పులు వంటి


11 రకాల లావాదేవీలు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందని,గత ప్రభుత్వాలు అందించని సంక్షేమ పథకాలు జగనన్న పాలనలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో సచివాలయ సిబ్బంది,వాలంటీర్ల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష పై అవగాహన కల్పిస్తూ ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరే విధంగా 11 రకాల సేవలకు సర్వీస్ ఛార్జీలు లేకుండా పూర్తిగా ఉచితంగా అందిస్తారన్నారని,పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని జగనన్న ఆశయాన్ని నెరవేర్చాలని తెలిపారు.అనంతరం నందికొట్కూరు పట్టణంలోని 5,6 సచివాలయంలో 589 మంది అర్హులకు మంజూరైన 856 సర్టిఫికెట్లును పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల మైనారిటీ జోనల్ ఇంఛార్జ్, సచివాలయ జె.సి.యస్ కన్వినర్ అబూబక్కర్, ఆర్.ఐ శ్యామలా దేవి, ఎలక్సన్ డి.టి కిషోర్,  కౌన్సిలర్లు అబ్దుల్ హామీద్, రాధిక,లాలు ప్రసాద్,శాలి భాష,మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,నందికొట్కూరు పట్టణప్రజలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: