బీజేపీ నేత జితేందర్ రెడ్డి మరో ట్వీట్,,,ఎక్కడో తేడా కొడుతుందన్న నెటిజన్లు


బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఇటీవల చేసిన వరుస ట్వీట్లు ఎంతటి రాజకీయ కలకలం సృష్టించాయో తెలిసిందే. ఓ దున్నపోతును ట్రాలీ ఎక్కించే వీడియోను పోస్టు చేసిన ఆయన.. ఇలాంటి ట్రీట్‌మెంట్ తెలంగాణ బీజేపీ నేతలకు అవసరం అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తెలంగాణ బీజేపీలో కలకలం రేపింది. దీనిపై ఇంటా బయట తీవ్ర విమర్శలు వచ్చాయి. అది మరవక ముందే జితేందర్ రెడ్డి మరో ట్వీట్ వదిలారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వేళ ఆయన చేసిన ట్వీట్ సంచనలంగా మారింది. ఆ వీడియోలో ఓ స్టూల్‌పైకి ముందుగా ఓ గొర్రెపిల్ల వచ్చి నిల్చుంటుంది. దాన్ని పక్కకు తోసేసి మరో గొర్రెపిల్ల ఆ ప్లేస్‌లో నిలబడుతుంది. ఇంతలో మరో గొర్రెపిల్ల వచ్చి దాన్ని కూడా పక్కకు తోసేసి స్టూల్‌పై నిల్చుటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గొర్రపిల్లలు స్టూల్‌ కోసం పోటీ పడతాయి.

ఆ వీడియోను ట్వీట్టర్‌లో పోస్టు చేసిన జితేందర్ రెడ్డి.. 2024 సాధారణ ఎన్నికల కోసం ప్రతి పక్షాల ప్రధాని అభ్యర్థి కోసం పోటీ అంటూ ఓ సెటైరికల్ కామెంట్ పెట్టారు. తాజాగా ఆయన చేసిన ఈ వీడియో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడో తేడా కొడుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు వేళ ఆయన చేసిన ఈ ట్వీట్‌ కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

ఇక తీవ్ర వివాదానాకి దారి తీసిన దున్నపోతు వీడియో ట్వీట్‌పై మంగళవారం జితేందర్ రెడ్డి స్పందించారు. తాను ఆ వీడియో పోస్టుపై ఎలాంటి కామెంట్స్ చేయనని అన్నారు. ఎవరెలా అర్థం చేసుకుంటారో అది వాళ్ల ఇష్టమని చెప్పారు. ఆ ట్వీట్ చూసి టీపీసీసీ రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేశారన్నారు. మంచి కవి హృదయమని తనను రేవంత్ మెచ్చుకున్నట్లు జితేందర్ రెడ్డి వెళ్లడించారు. ఇక ఈ ట్వీట్‌పై కొద్ది రోజుల క్రితం ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. వయస్సు, అనుభవం ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదిపడితే అది మాట్లాడితే మంచిది కాదని హితవు పలికారు. ఆయన ఆ కామెంట్స్ చేసిన రెండ్రోజుల తర్వాత జితేందర్ రెడ్డిని కలిసిన ఈటల సరదాగా మాట్లాడుకున్నారు. తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. ఇంతలో మరో ట్వీట్ వదిలిన జితేందర్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: