అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

అర్హులైన పేదలకు ఇంటి స్థలాల పట్టాలు ఇస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామంలో పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీకి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... స్వంత ఇంటి కల నెరవేర్చే క్రమంలో భాగంగా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని అన్నారు. గ్రామంలో లే ఔట్ ఏర్పాటు చేసి అర్హులైన వారికి లాటరీ ద్వారా ఏ ప్లాట్ ఎవరికో ఎంపిక జరుగుతుందన్నారు. అందులో భాగంగా స్థానికంగా అర్హులైన పేద వారిని గుర్తించి,పార్టీలకతీతంగా ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్వంత జాగా ఉన్న వారికి ప్రభుత్వం 3 లక్షలు గృహ లక్ష్మీ పథకం కింద అందిస్తుందన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: