స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి
జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్ లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజల నుండి డిఆర్ఓ పుల్లయ్య మరియు జిల్లా అధికారులు ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రెవిన్యూ అధికారి పుల్లయ్య మాట్లాడుతూ జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీకి పెండింగ్ లో ఉన్న రిక్వెస్ట్ లను రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా సంబంధిత అధికారులను ఆదేశించారు.స్పందన కార్యక్రమంలో డిఆర్వో పుల్లయ్య మరియు జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి బి.పుల్లయ్య మాట్లాడుతూ జగనన్న సురక్షకు సంబంధించి నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లి, దొర్నిపాడు,డోన్, ఆత్మకూరు,ఆళ్లగడ్డ, నందికొట్కూరు తదితర మండలాల్లో అధికంగా పెండింగ్ (జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి) సర్వీస్ రిక్వెస్ట్ లను వెంటనే క్లియర్ చేసి నివేదికలను అప్లోడ్ చేయాలని నియోజకవర్గ అధికారులను,సంబంధిత మండల అధికారులను ఆదేశించారు.స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి,అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు సంబంధిత అధికారులు తప్పనిసరిగా పరిష్కరించాలని,పెండింగ్ దరఖాస్తులు,బియాండ్ ఎస్ఎల్ఏ,రీఓపెనింగ్ లు లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిష్పక్షపాతంగా వ్యవహరించి అర్జీలను పరిష్కరించాలన్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరై ఇంకా ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు, నందికొట్కూరు,బేతంచర్ల మున్సిపల్ అధికారులను ఆదేశించారు.స్పందన కార్యక్రమం అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని 11-07-23 నుండి 24-07-23 వరకు నిర్వహించే కార్యక్రమాలపై ముద్రించిన కరపత్రాలను డిఆర్ఓ,డిఎంహెచ్ఓ ఆవిష్కరించారు.అనంతరం స్పందన కార్యక్రమంలో 185 మంది అర్జీదారులు సమస్యల పరిష్కారానికి అర్జీలు పెట్టుకున్నారని,ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి,జిల్లాస్థాయి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Home
Unlabelled
స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి... జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: