నంద్యాల జిల్లాలో గ్రామీణ వైద్యుల సంఘాల ఆధ్వర్యంలో...

ఘనంగా వైయస్సార్ జయంతి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 74 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లాలో పట్టణ, మండల మరియు గ్రామాలలో ప్రథమ చికిత్స కేంద్రాలను నడుపుతున్న గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణయ్య,జిల్లా కన్వీనర్ రొక్కం నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలకు అందుబాటులో ఉండి ప్రధమ చికిత్స కేంద్రాలను నడుపుతున్న వైద్యులను గుర్తించి గ్రామీణ వైద్యులకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గ్రామీణ వైద్యుల గుర్తింపు కొరకు జీవో నెంబర్ 429 ద్వారా ప్రభుత్వ వైద్యశాలలలో శిక్షణా తరగతులను నిర్వహించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికే ఆ ఘనత చెందుతుందని, గ్రామీణ వైద్యుల సంక్షేమం కొరకు పాటుపడి సమాజంలో గ్రామీణ వైద్యులకు సముచిత స్థానాన్ని నిలబెట్టినదివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని కృతజ్ఞతతో గ్రామీణ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నమని తెలిపారు. గ్రామీణ వైద్యులకు అందించిన శిక్షణా తరగతులు అనివార్య కారణాల వలన నిలిచిపోయాయని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ వైద్యుల శిక్షణా తరగతులను ప్రారంభించి పూర్తిచేసి తండ్రి ఆశయాన్ని నెరవేర్చి తండ్రికి తగ్గ తనయుడుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా నాయకులు నాగేశ్వరరావు,పట్టణ కన్వీనర్ శ్రీనివాసులు రమేష్ బాలుడు నాగరాజు మధు ఉబేదుల్లా,నయుం, పట్టణ,మండల,గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ప్రధమ చికిత్స వైద్యులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: