సామాన్య ప్రజలకు అండ... తెలుగుదేశం జెండా 

పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

(జానో జాగో వెెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యo నియోజకవర్గం లోని నెరవాడ గ్రామం లో "భవిష్యత్తుకి-గ్యారంటీ"కార్యక్రమాన్ని పాణ్యo మాజీ టీడీపీ శాసనసభ సభ్యురాలు మరియు పాణ్యం టిడిపి ఇంచార్జి గౌరు చరిత రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా  నేరవాడ గ్రామంలోని ఇంటింటికీ తిరిగి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను గ్రామ ప్రజలకు అందించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మొదటి విడత మేనిఫెస్టో పథకాల్ని సవివరంగా వివరిస్తూ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు వల్ల ప్రజలకు చేకూరే లబ్ధి గురించి వివరించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ కి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని,


చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వస్తె ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,యువతకు భారీగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని,మొదటి విడత మేనిఫెస్టో లో సామాన్య ప్రజలందరికీ లబ్ధి పొందే పథకాలు చంద్రబాబు  ప్రకటించడం మన అదృష్టం మని శ్రీమతి గౌరు చరితారెడ్డి గ్రామ ప్రజలకు వివరించారు.

ఈకార్యక్రమంలో నెరవాడ గ్రామ టిడిపి నాయకులు అమరసింహ రెడ్డి,  ప్రతాప్ రెడ్డి, మునిశ్వర్ రెడ్డి, నారాయణరెడ్డి, రాజ గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు జయరామి రెడ్డి, కౌలురు సర్పంచ్ భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ టీడీపి యస్సీ సెల్ అధ్యక్షుడు దానం, కోనిదేడు రామ్ పుల్లారెడ్డి, మండల నాయకులు రమణమూర్తి, పాణ్యo మండల మాజీ జెడ్పీటీసీ నారాయణమ్మ, గ్రామటీడీపీ నాయకులు కార్యకర్తలు,  అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: