పురందేశ్వరికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు


బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. పురందేశ్వరికి శుభాకాంక్షలు అని, కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన పురందేశ్వరి కొత్త బాధ్యతలలో విజయవంతంగా ముందుకు సాగుతారని భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను కిషన్ రెడ్డి విజయవంతంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: