భార్య పుట్టింటికి వెళ్లిందని ,,,మనస్థాపంతో భర్త ఆత్మహత్య
కుటుంబంలోని కలహాలు ఎంతటికి దారితీస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ దంపతుల మధ్య మనస్పర్థదలు రావటం సర్వసాధారణం. కలహాలు లేని కాపురాలు ఉండవని పెద్దలు అంటారు. భార్యభర్తలు గొడవ పడటం ఆపై కలిసిపోవటం సమాజంలోని ప్రతి ఇంట్లోనూ జరిగేదే. అసలు అలకలు, గిల్లికజ్జాలు లేకుండా సంసారం సంతోషంగా ఉండదని కూడా అంటారు. ఇక ఎంత గొడవ పడినా.. ఓ 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయనే వాస్తవం. ఆ తర్వాత సంసారం సాఫీగా సాగిపోతుంది. అయితే ఈ మధ్య కొందరు దంపతుల్లో విచక్షణ లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలకు గొడవ పడి.. వాటిని భూతద్దాల్లో పెట్టి చూస్తున్నారు. అలకలను పెద్దవిగా ఉహించుకొని క్షణికావేశానికి లోనవుతున్నారు. వారి గొడవలు పచ్చని సంసారాలను నాశనం చేస్తూ.. విడాకుల వరకు వెళ్తున్నాయి. మరికొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.
తాజాగా.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావట్లేదని ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేత్రి మధు (34)కు మండలంలోని ఓ గ్రామానికి యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే తాగుడుకు బానిసైన మధు.. భార్య మెడలోని మంగళ సూత్రం, కాళ్ల పట్టీలు అమ్మేశాడు. దీంతో గత కొంత కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.
మోసపోయిన భర్త కన్నీటి ఆవేదన.. ఇలాంటి పరిస్థితి ఏ మగాడికి రాకూడదు ఈ క్రమంలో గత నెల రోజుల క్రితం భార్య పుట్టింటింకి వెళ్లిపోయింది. తాను ఇక కాపురానికి రానని భర్తతో చెప్పింది. దీంతో మనస్థాపం చెందిన మధు.. ఇంటి వెనకాల ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Home
Unlabelled
భార్య పుట్టింటికి వెళ్లిందని ,,,మనస్థాపంతో భర్త ఆత్మహత్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: