మీ నమ్మకాన్ని వమ్ముకానివ్వను
నేను మరింత బాధ్యతతో పనిచేస్తా
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అభివృద్ధిపై సబితమ్మకున్న చిత్తశుద్ది ఎనలేనిదని గొంతెత్తి పాడిన గాయకులు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మీర్ పేట్ కార్పొరేషన్ 45 డివిజన్ లో కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రూ. 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆట పాటలతో కళాకారులు ఆకట్టుకొన్నారు. అహర్నిశలు శ్రమిస్తూ సబితమ్మ చేస్తున్న మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిపై తెలంగాణ గాయకులు గొంతెత్తి గర్జించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా,చూపిస్తున్న ఆదరాభిమానాలతో మరింత బాద్యతతో పనిచేస్తానని పేర్కొన్నారు. 250 కోట్లతో నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు,తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
నగరానికి నలువైపులా ఒక్కో ఆస్పత్రికి 1200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు తద్వారా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లపై భారం తగ్గుతుందని అన్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఒక్క యూపిహెచ్సి లేదని నేడు మన ప్రాంతంలో అర్బన్ పిహెచ్సీలు,10బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసమన్నారు. కుల,చేతి వృత్తుల వారికి అండగా కేసీఆర్ గారి ప్రభుత్వం నిలుస్తుందని,లక్ష రూపాయల సహాయం అందిస్తుందని మంత్రి తెలిపారు.ఖాళీ స్థలం
ఉంటే 3 లక్షలు గృహ లక్ష్మి పథకం కింద మహిళలకు ప్రభుత్వం అందిస్తుందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.రజకులకు,నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు,ఎస్ సి,ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందిస్తున్నారు.9 ఏళ్ల కిందట మన ప్రాంతం ఎట్లుండెనో,ఇపుడు ఎలా మారిందో ప్రతి ఒక్కరు పోల్చి చూసుకోవాలన్నారు.
Home
Unlabelled
మీ నమ్మకాన్ని వమ్ముకానివ్వను,,,, నేను మరింత బాధ్యతతో పనిచేస్తా,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి,,,, అభివృద్ధిపై సబితమ్మకున్న చిత్తశుద్ది ఎనలేనిదని గొంతెత్తి పాడిన గాయకులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: