శ్రీ మహంకాళి అమ్మవారికి మహిళల చేత సారే సమర్పణ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్  ప్రతినిధి)

త్రిశక్తి నారి తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు మన అమ్మకు మనసారే మనసారా కార్యక్రమంలో భాగంగా లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి సుమారు 80 మంది మహిళలచే అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో ఉన్న 150 డివిజన్లలో ఒక్కోక్క గ్రామ దేవతకు సారే సమర్పిచడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి ప్రతి అషాడ మాసంలో అమ్మవారికి మనసారా సారే సమర్పించడం ఈ కార్యక్రమానికి బి.సి. కమీషన్ చైర్మన్ వకులాభరణం, హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త, త్రిశక్తి నారి తరంగిణి సంస్థ అధ్యక్షురాలు యాద మంజుల, కార్యదర్శి గందె సౌజన్య, సరాబు విశ్వేశ్వరయ్య గుప్త, ఆలయ కమిటి ప్రతినిధులు బల్వంత్ యాదవ్, కె. వెంకటేష్ మేరు, మారుతి యాదవ్, అరవింద్ గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: